Samantha: కూకట్‌పల్లి కోర్టులో సమంత పిటిషన్… ‘బాధలో ఉంటే గద్దల్లా పొడుస్తున్నారు’.. మనసున ఎంతో ఆవేదన
మేం విడిపోయామ్. మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు. లేనిపోని రూమర్లు సృష్టించొద్దు. సామ్ చైతూ విడిపోతూ చేసిన రిక్వెస్ట్ ఇది. కానీ, సమంత టార్గెట్ అయ్యింది.
మేం విడిపోయామ్. మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు. లేనిపోని రూమర్లు సృష్టించొద్దు. సామ్ చైతూ విడిపోతూ చేసిన రిక్వెస్ట్ ఇది. కానీ, సమంత టార్గెట్ అయ్యింది. తప్పందా సామ్‌దే. ఆమెకు తల్లి కావడం ఇష్టం లేదు. అబార్షన్ చేయించుకుంది. ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయ్. అందుకే చైతూ డైవోర్స్ ఇచ్చేశాడంటూ సమంతపై ట్రోల్స్ అటాక్ జరిగింది. ఇంతకీ, సామ్ చైతూ ఎందుకు విడిపోయారో తెలుసా?.. ట్రోల్స్‌లో ఇదే మెయిన్ పాయింట్. ప్రతి ట్రోల్‌లోనూ సమంతే టార్గెట్. ట్రోల్స్ అండ్ రూమర్స్ శృతిమించడంతో సామ్ క్లారిటీ కూడా ఇచ్చింది. నాకెలాంటి ఎఫైర్స్ లేవ్. నేను అబార్షన్ చేయించుకోలేదు. తల్లి కావడానికి నేను ఒప్పుకోలేదన్న మాటల్లో నిజం లేదంటూ చెప్పుకుంది. అయినా, సామ్‌పై ట్రోల్స్ వార్ కంటిన్యూ అయ్యింది. ఇదే, ఆమె కోర్టు మెట్లెక్కడానికి కారణం.
సోషల్ మీడియా వేదికగా జరుగుతోన్న ట్రోల్స్‌పై సమంత కోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనపై దుష్ప్రచారం చేసిన డాక్టర్ సీఎల్ వెంకట్రావుతోపాటు మరో మూడు య్యూట్యూబ్ ఛానళ్లపై సమంత పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌తో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని సమంత కోరారు. అలాగే, తనపై లేనిపోని ఎఫైర్లు అంటగట్టిన డాక్టర్ సీఎల్ వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు రిక్వెస్ట్ చేశారు. ఆ యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా నుంచి ఆ లింకులు డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇకపై దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని సామ్ రిక్వెస్ట్ చేశారు
పిటిషన్‌లో సమంత ఆవేదన
“తెలుగులో అత్యంత పాపులర్ నటిని నేను. నాపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని ఆపడానికే ఈ పిటిషన్ వేశా. 45 సినిమాల్లో నటించా. 4 ఫిలిం ఫేర్ అవార్డులు. 2 నంది అవార్డులు, 6 సౌతిండియా అవార్డులు, 3 సినీ మా అవార్డులు అందుకున్నా. 12 మల్టీ నేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశా. స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ఇంత పాపులరైన నన్ను కొందరు వ్యక్తులు కించపరుస్తున్నారు. నా పరువును బజారుకు ఈడుస్తున్నారు. 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకున్నా. 2021, అక్టోబర్ 2న విడిపోతున్నట్టు ఇద్దరం కలిసి ప్రకటన చేశాం. ఆ ప్రకటన తర్వాతే నాపై అసత్య ప్రచారం మొదలుపెట్టారు. యూట్యూబ్ ఛానెల్స్, సీఎల్ వెంకట్రావు… నాపై అసభ్య కామెంట్స్ చేశారు. నన్ను, నా క్యారెక్టర్‌ని దారుణంగా కించపర్చారు. నా దాంపత్య జీవితంపై అనేక అనుమానాలు లేవనెత్తారు. అబార్షన్ చేయించుకున్నానని తప్పుడు ప్రచారం చేశారు. ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్‌తో సంబంధముందని ప్రచారం చేశారు. నాకు, నాగచైతన్యకు గొడవలు ఉన్నాయని…సమంత అబద్ధాలు చెబుతోందని అసత్య ప్రచారం చేశారు. విడాకుల కోసం రూ.300కోట్ల డీల్ కుదిరిందని తప్పుడు ప్రచారం చేశారు. నా డ్రెస్సింగ్‌పై వీడియోలు పెట్టి కించపర్చారు. నా ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించారు. నా వివరణ తీసుకోకుండానే అసత్య ప్రచారం చేశారు. నా ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసమే పక్కా ప్లాన్‌తో వీడియోలు చేశారు. ఆ యూట్యూబ్ ఛానెల్స్‌లో నా వీడియో లింకులను తొలగించండి. నాకు పబ్లిక్‌గా క్షమాపణ చెప్పించండి. ఆ ముగ్గురిపై క్రిమినల్ చర్యలు తీసుకోండి. మరోసారి దుష్ప్రచారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి.” అని సమంత పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read: జైలుకెళ్లి తనయుడు ఆర్యన్‌ను కలిసిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్