Illegal liquor: ఓరి గడుగ్గాయ్.. బైక్‌లో ఇన్ని లిక్కర్ బాటిల్సా.. కౌంట్ చేసి కంగుతిన్న పోలీసులు

ఇది మాములు బైకే కదా అనుకునేరు..! నో...ఫుల్‌ లోడ్‌లో ఉంది. Yes..మీరు చూస్తున్న ఈ టూవీలర్‌లో ఏకంగా సెంచరీకి చేరువలో మద్యం సీసాలు ఉన్నాయి. అన్నీ బాటిళ్లు అందులో ఎలా ఉంచారు..? అదే మందుబాబుల లేటెస్ట్‌ ట్రెండ్‌.

Illegal liquor:  ఓరి గడుగ్గాయ్..  బైక్‌లో ఇన్ని లిక్కర్ బాటిల్సా.. కౌంట్ చేసి కంగుతిన్న పోలీసులు
Illegal Liquor Smuggling
Follow us

|

Updated on: Oct 21, 2021 | 7:59 AM

మద్యం అక్రమ రవాణాకి కొత్త ట్రెండ్‌ చేస్తున్నారు కేటుగాళ్లు. పోలీసులకు అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు మద్యాన్ని తీసుకొచ్చి..తమ ప్రాంతంలో ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు మందుబాబులు. పనిలోపనిగా వైన్‌ తరలించడానికి అనేక కొత్త దారులు వెతుకుతున్నారు. ఇదే తరహాలో అక్రమంగా మద్యాన్ని తరలిస్తూ చెన్నై సమీపంలో అడ్డంగా దొరికిపోయింది తాగుబోతు బ్యాచ్‌. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో మద్యం ధరలు చాలా తక్కువ. అక్కడ తక్కువ ధరకు వైన్‌ కొనుగోలు చేసి…వాటిని చెన్నై శివారులో అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చెన్నైకి చెందిన ఓ తాగుబోతు గ్యాంగ్‌…పాండిచ్చేరికి వెళ్లి భారీగా మద్యం కొనుగోలు చేసింది. వాటిని కారు, బస్సులో తరలిస్తే చెక్‌పోస్టు దగ్గర దొరికిపోయే ఛాన్సుంది. అందుకే కొత్త తరహాలో తరలించేందుకు సిద్ధమయ్యారు.

బైక్‌లైతే పోలీసులకు అనుమానం రాదని భావించారు. ఓ బైక్‌లో పెట్రోల్‌ ట్యాంక్ లోపల, సీటు కింద మద్యం బాటిళ్లను దాచారు. సుమారు వందకుపైగా బాటిళ్లను అందులో ఉంచారు. పాండిచ్చేరి నుంచి బయల్దేరిన బైక్‌ను విల్లుపురం సమీపంలో పోలీసులు ఆపారు. బైక్‌ను తనిఖీ చేశారు. తాగుబోతు గ్యాంగ్‌ కంగారు పడటంతో అనుమానంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బైక్‌ లోపల దాచిన మద్యం బాటిళ్లను ఒక్కొక్కటిగా బయటకు తీశారు. తీసేకొద్దీ బయటపడుతుంటంతో పోలీసులే షాకయ్యారు. భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురి అరెస్టు చేసి విచారించారు. గత కొంతకాలంగా ఇదే తరహాలో మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరికి ఇంకా ఎవరెవరితో లింకులున్నాయి..? ఎన్ని గ్యాంగ్‌లు ఈ తరహా అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే కోణంలో విచారిస్తున్నారు.

Also Read: ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఉత్తర్వులు జారీ

మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వం రోల్ ఇదే.. తేల్చేసిన అశోక్‌ గజపతిరాజు

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!