AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్… ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

Andhra Pradesh: ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్...  ఉత్తర్వులు జారీ
Ap Government
Ram Naramaneni
|

Updated on: Oct 21, 2021 | 7:42 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సర్వీసు కాలాన్ని 2022 మార్చి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు పొడిగింపు వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. ఉన్నత, పాఠశాల, సాంకేతిక విద్యాశాఖ, వైద్య, న్యాయ, క్రీడాశాఖ ఒప్పంద ఉద్యోగుల సర్వీసును పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు కాలాన్ని పొడిగించినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.  గవర్నమెంట్ నిర్ణయంపై కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు PRC ఇచ్చేందుకు కసరత్తు

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న PRC ఇచ్చేందుకు కసరత్తు మొదలైంది. ఈ నెలాఖరులోపే ఇచ్చేలా ప్రక్రియను మొదలు పెట్టింది ప్రభుత్వం. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చల అనంతరం ఉద్యోగుల సమస్యలన్నీ దశల వారీగా పరిష్కరిస్తామని హామీనిచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరోవైపు తమ డిమాండ్లు నెరవేరే వరకు రాజీపడబోమన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, గతంలోలా ఉద్యోగులను రాజకీయాల కోసం వాడుకోబోమన్నారు సజ్జల.

Also Read: ఈ రాశుల వారిలో పోటీతత్వం ఎక్కువ.. ఎటువంటి పరిస్థితిలోనూ రాజీ పడరు.. ఆ రాశులేమిటంటే..