AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashok Gajapathi Raju: మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వం రోల్ ఇదే.. తేల్చేసిన అశోక్‌ గజపతిరాజు

ట్రస్టు వేరు..ప్రైవేట్‌ ప్రాపర్టీ వేరు..ట్రస్టులకు ప్రభుత్వం ఓవర్‌ కాదన్నారు మాన్సాస్‌ ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజు. ఆడపిల్లలకు హక్కు అస్సలు ఉండదన్నారు.

Ashok Gajapathi Raju: మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వం రోల్ ఇదే.. తేల్చేసిన అశోక్‌ గజపతిరాజు
Ashok Gajapathi Raju
Ram Naramaneni
|

Updated on: Oct 21, 2021 | 7:39 AM

Share

మాన్సాస్‌ ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ నియామకం, ఆలయ భూముల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు. మాన్సాస్‌ ట్రస్టు విషయంలో ఆడపిల్లలకు హక్కులు వస్తాయని కొందరు మంత్రులు అందర్నీ కన్‌ఫ్యూజ్‌ చేశారని ఆరోపించారు. రక్తం పంచుకు పుట్టిన పిల్లలకు తమ ఆస్తి పంపకాల్లో విభేదాలు ఉండరాదన్నారు. అయితే ట్రస్టు వేరు, ప్రైవేట్‌ ప్రాపర్టీ వేరన్నారు. ట్రస్టు ప్రభుత్వ ఆస్తులంటూ కొందరు కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారు. మాన్సాస్‌ ట్రస్టు విషయంలో భక్తులు ఇచ్చిన కానుకలు దేవుడికే చెల్లుతాయన్నారు అశోక్‌గజపతిరాజు. ఇది ప్రభుత్వ ఆస్తి ఎంత మాత్రం కాదన్నారాయన. ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ విషయంలో ప్రభుత్వం ఓ రెగ్యులేటర్‌గానే పనిచేస్తుందన్నారు. ఐతే ఓనర్‌ మాత్రం కాదన్నారు. ప్రభుత్వం రోల్‌ ఏంటనేది స్పష్టంగా ఉందన్నారు.

రాష్ట్రంలో ఆనవాయితీగా ఉన్న దేవాలయాలు 230 వరకు ఉన్నాయన్నారు. కావాలంటే వాటికి ప్రభుత్వం ఫౌండర్‌ మెంబర్స్‌ మొత్తం మహిళలకే ఇవ్వొచ్చన్నారు. సింహాచలం దేవాలయ భూములను ఓ పాలసీ ప్రకారం ఇవ్వాలనేది తన అభిప్రాయమన్నారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత కక్ష లేదన్నారు. అందరితో కలిసి పనిచేస్తానన్నారు. ధర్మకర్తగా తనకు- అధికారులకు మధ్య భవిష్యత్తులో విభేదాలు రాకుడదన్నారు. మాన్సాస్‌ ఈవోను తాను వెళ్లి కలవాలని ట్రై చేశారని..ఐతే ఆయన తనకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. తాజాగా జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం ద్వారా గతంలో తీసుకున్న నిర్ణయాలు ఏంటనేది కొంతవరకు తెలిశాయన్నారు. ఐతే రికార్డులలో మాత్రం కొన్ని తేడాలు ఉన్నాయన్నారు. భక్తులకు సౌకర్యాలకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయన్నారు. దానిపై హోంవర్క్‌ చేసి అన్ని కోణాల నుండి రిపోర్ట్స్‌ తెప్పించుకుంటాని అశోక్‌గజపతిరాజు చెప్పారు.

Also Read: ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఉత్తర్వులు జారీ

Follow Us
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్