Nayanthara: చెట్టును వివాహం చేసుకోనున్న నయనతార.. ఇన్ని రోజులు పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం అదేనా.?
Nayanthara: నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య ప్రేమ వ్యవహారినికి సంబంధించి ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లి పీఠలెక్కనున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే..
Nayanthara: నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య ప్రేమ వ్యవహారినికి సంబంధించి ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లి పీఠలెక్కనున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ జంట మాత్రం ఇప్పటి వరకు ఈ గుడ్ న్యూస్ చెప్పలేదు. ఎప్పటికప్పుడు వివాహం వాయిదా పడుతూ వస్తోంది. ఒకానొక సమయంలో అయితే నయన్, విఘ్నేష్‌లు వివాహం క్యాన్సిల్ అయిందని కూడా వార్తలు వచ్చాయి. వీరి వివాహం వాయిదా పడుతూ రావడమే దీనికి కారణంగా అప్పట్లో వైరల్ అయింది. అయితే నయన తార, విఘ్నేష్‌ల వివాహం వాయిదా పడుతుండడానికి పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. నయనతారకు పుట్టుకతో దోషం ఉందని ఆ కారణంగానే దోష పరిహారం చేసుకునేంత వరకు వివాహం చేసుకోకపోవడమే మంచిదని పండితులు చెప్పడంతో ఈ జంట పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలోనే దోష నివారణ చర్యలో భాగంగా నయనతార కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విఘ్నేష్ కంటే ముందు నయనతార ఓ చెట్టును పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. జ్యోతిష్యుల సూచన మేరకు నయన్ తొలుత చెట్టును పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
View this post on Instagram
ఇలా చెట్టును పెళ్లి చేసుకున్న తర్వాత విఘ్నేష్‌ను వివాహం చేసుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుందని పండితులు నయన్‌కు చెప్పారట. దీంతో త్వరలోనే ఈ కార్యక్రమం పూర్తికాగానే నయన్ జంట పెళ్లి పీటలెక్కనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకునే ముందు ఐశ్వర్య రాయ్ కూడా ఇలాంటి ఆచారాన్నే ఫాలో అయ్యారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
View this post on Instagram
Shah Rukh Khan: జైలుకెళ్లి తనయుడు ఆర్యన్‌ను కలిసిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్
100 Crore Vaccination: 100 కోట్ల మార్కును దాటిందోచ్.. కొవిడ్ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న భారత్..