Balineni: జగన్‌ తలుచుకుంటే చంద్రబాబు, లోకేష్‌ భస్మం అయిపోతారు: మంత్రి బాలినేని

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల నిరసన కార్యక్రమం, పట్టాభి వ్యవహారం మీద ఆం‍ధ్రప్రదేశ్‌ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి మండిపడ్డారు.

Balineni: జగన్‌ తలుచుకుంటే చంద్రబాబు, లోకేష్‌ భస్మం అయిపోతారు: మంత్రి బాలినేని
Balineni On Chandrababu
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 21, 2021 | 1:05 PM

Balineni Srinivas Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల నిరసన కార్యక్రమం, పట్టాభి వ్యవహారం మీద ఆం‍ధ్రప్రదేశ్‌ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి మండిపడ్డారు. జగన్‌ తలుచుకుంటే చంద్రబాబు, లోకేష్‌ భస్మం అయిపోతారన్నారు. చంద్రబాబు జీవితమంతా కుట్రలమయమని చెప్పుకొచ్చిన బాలినేని, చంద్రబాబు డైరెక్షన్‌లోనే పట్టాభి బూతులు మాట్లాడారన్నారు. చంద్రబాబు దీక్ష అంటేనే ఒక దొంగ దీక్ష అని మంత్రి బాలినేని విమర్శించారు. ఏపీలో కుట్రలో కుతంత్రాలు చేస్తామంటే ఊరుకోబోమని ఆయన పేర్కొన్నారు.

పట్టాభి మాట్లాడిన అసభ్య పదజాలాన్ని చంద్రబాబు వెనకేసుకోస్తారా? అని ప్రశ్నించిన బాలినేని.. గతంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి టీడీపీ నేతలు రథాలు తగలబెట్టించారని ఆరోపించారు. పైయిడ్ ఆర్టిస్ట్ పట్టాభిని ఇలా మాట్లాడి ఉండకుండాల్సింది అనకుండా పైగా మాట్లాడే స్వేచ్ఛ లేదా అంటున్నాడు ఈ సంస్కార హీనుడు చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు బాలినేని. “ప్రజాస్వామ్య స్పూర్తి అంటే ఇలా ఇష్టం వచ్చినట్లు తిట్టడమా? నిన్నటి ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలి.” అని బాలినేని డిమాండ్ చేశారు.

పార్టీ అధినేత చంద్రబాబుని క‌లిసొచ్చిన త‌ర్వాతే ప్రెస్‌మీట్ పెట్టి పట్టాభి ఇలాంటి భాష మాట్లాడటం చూస్తుంటే కచ్చితంగా బాబు ఆదేశాలతోనే మాట్లాడిన‌ట్టు అర్థమ‌వుతోందని బాలినేని సందేహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని గౌర‌వ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ పార్టీ అధికార ప్రతినిధి ప‌ట్టాభి చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబే పూర్తి బాధ్యత వ‌హించాలని మంత్రి అన్నారు.

Read also:  Kannababu: సింపథీ వస్తుందనుకుంటే పొరపాటే, చివరికి చంద్రబాబు, వారి పార్టీనే అభాసుపాలవుతుంది: ఏపీ మంత్రి