NTR: ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ ఇలాంటి పాత్రలో కనిపించనున్నాడట..!

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు తారక్. కొమురం భీం గా తారక్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది.

NTR: ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ ఇలాంటి పాత్రలో కనిపించనున్నాడట..!
Ntr , Prashanth Neel
Follow us

|

Updated on: Sep 27, 2022 | 7:19 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం కొరటాల శివ సినిమాకోసం సిద్ధం అవుతున్నారు . ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు తారక్. కొమురం భీం గా తారక్ నటన ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఇప్పుడు కొరటాల సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తారక్. ఇటీవలే ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న కొరటాల.. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకోసం గట్టి కసరత్తు చేస్తున్నారు. పవర్ ఫుల్ కథను రెడీ చేశారు కూడా.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతాగ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు తారక్.

కేజీఎఫ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమా చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ చాలా పవర్ఫుల్ గా డిజన్ చేశారట ప్రశాంత్. ఇక ఈ సినిమా తర్వాత తారక్ తో సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఒక పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేశాడట.. అయితే ఈ సినిమాలో తారక్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఇప్పటికే ఫస్టు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఎలా ఉండనుందని విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. గతంలో ‘జై లవ కుశ’ సినిమాలో ఒక పాత్రలో నెగెటివ్ షేడ్స్ తో కనిపించిన ఎన్టీఆర్. ఇప్పుడు ఇదే తరహా పాత్రలో కనిపించనున్నాడట తారక్ . మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!