AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూఇయర్ అంతా హ్యాపీగా ఉండాలంటే తొలి రోజు ఏం చేయాలో తెలుసా?

కొత్త ఏడాది వస్తోందంటే చాలా మంది తాము చేయాల్సిన పనులను నిర్దేశించుకుంటారు. పెండింగ్ పనులను పూర్తి చేయడం, కొత్త పనులను ప్రారంభించడం లాంటి అంశాలను తీర్మానించుకుంటారు. అయితే, ఏడాదంతా ఆనందంగా సానుకూల శక్తితో ఉండాలంటే నూతన సంవత్సరం తొలి రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాల్సి ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

న్యూఇయర్ అంతా హ్యాపీగా ఉండాలంటే తొలి రోజు ఏం చేయాలో తెలుసా?
New Year 2026
Rajashekher G
|

Updated on: Dec 27, 2025 | 12:42 PM

Share

మరో నాలుగు రోజుల్లో మనమందరం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. దీంతో చాలా మంది కొత్త సంవత్సరం తమకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. అంతేగాక, తాము చేయాల్సిన పనులను షెడ్యూల్ చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం పెండింగ్‌లో ఉన్న పనులను కొత్త ఏడాదిలో పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. కొత్త సంవత్సరం తొలి రోజు సంతోషంగా గడిపితే ఏడాదంతా ఆనందంగా ఉంటారని చాలా మంది నమ్ముతుంటారు. ఈ క్రమంలో నూతన సంవత్సరం ప్రారంభరోజు అందరికీ కీలకంగా మారనుంది.

కొత్త ఏడాది పొడవునా మీకు సానుకూలంగా ఉండాలంటే మొదటి రోజు అంటే జనవరి 1, 2026 ఈ పని చేయాలి. మీ ఇంటిపై చెడు కళ్లు పడకుండా ఉండేందుకు, శాంతి, ఆనందం నెలకొనేందుకు ఆరోజు ఇలా చేయాలి. కొత్త సంవత్సరం తొలి రోజున ఇంటిని పూర్తిగా శుభ్రం చేయండి. ఉదయమే స్నానం చేసి పూజ పూర్తి చేసుకోండి. ఆ తర్వాత ఇంటి అంతటా గంగాజలం(నీరు) చల్లుకోండి.

కొత్త ఏడాది తొలి రోజు ఇలా చేయండి

ముఖ్యంగా ఒక పాత్రను నీటితో నింపి మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంచండి. ఈ పాత్రను ఏదైనా లోహంతో తయారుచేసినదై ఉండేలా చూసుకోండి. ఇత్తడి లేదా రాగిదేతే ఇంకా మంచిది. ఉదయం నుంచి రాత్రి వరకు దీన్ని ఒకే చోట ఉంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం నూతన సంవత్సరం రోజున ఒక పాత్రలో నీటితో నింపి ఇంటి ప్రధాన ద్వారా దగ్గర ఉంచడం వల్ల ఇల్లు సానుకూల శక్తితో నిండిపోతుంది.

ఆ వస్తువులను ఇంట్లో ఉంచొద్దు

కొత్త సంవత్సరం మొదటి రోజున ఇంటి లోపలి భాగం మాత్రమే కాకుండా ఇంటి ప్రధాన ద్వారా, ఇంటి ప్రాంగణం అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంటి తలుపు వద్ద మురికి చెప్పులు, షూలు ఉంచరాదు. మీ ఇంట్లో ఏవైనా విరిగిన లేదా దెబ్బతిన్న వస్తువులు ఉంటే.. కొత్త ఏడాదికి 3-4 రోజుల ముందే వాటిని పారవేయండి. పగిలిన గాజును కూడా ఇంట్లో ఉంచకూడదు.

మీ దగ్గర ఉన్న గడియారం పనిచేయకపోతే.. దాన్ని కూడా సరిచేయండి. పూర్తిగా దెబ్బతింటే పారవేయండి. ఇక, నూతన సంవత్సరం రోజున మొక్కలు నాటడం మంచిది. అయితే, ముళ్ల మొక్కలను నాటవద్దు. తులసీ లేదా మనీ ప్లాంట్ నాటవచ్చు. వాస్తు ప్రకారం ఈ పనులు చేయడం వల్ల మీ ఇల్లు సానుకూల శక్తితో నిండిపోతుంది.

Follow Us
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు,రైల్లోనే కిచెన్ ఓపెన్ చేసి నానా రచ్చ
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
చావు అంచుల నుంచి మత్స్యకారులను కాపాడిన కోస్డ్ గార్డ్!
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..