Mimicry Murthy Death: సినిమా ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో కన్నుమూసిన జబర్దస్త్ కమెడియన్
2018లో జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టారు. పలు స్కిట్లలో తనదై మార్క్ కామెడీతో అలరించాడు. ఆ తర్వాత ఎన్నో వేదికలపై పలు మిమిక్రీ ప్రదర్శనలు కూడా ఇచ్చాడు.

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మిమిక్రీ మూర్తి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (సెప్టెంబర్ 27) మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు అరుణ్ స్వయంగా తెలియజేశారు. కాగా మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న మూర్తి.. 2018లో జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టారు. పలు స్కిట్లలో తనదై మార్క్ కామెడీతో అలరించాడు. ఆ తర్వాత ఎన్నో వేదికలపై పలు మిమిక్రీ ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. కాగా మూర్తి కొన్నేళ్లుగా ప్యాంక్రియాస్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఈ మహమ్మారి నుంచి బయట పడడానికి చాలా రోజులుగా చికిత్స తీసుకుంటున్నారు. అయినా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. కాగా తన ఆరోగ్య పరిస్థితి గురించి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు మూర్తి. కేవలం మూడేళ్లలోనే తన వైద్యం కోసం దాదాపుగా రూ.16 లక్షలు ఖర్చు పెట్టారు. చాలామంది దాతలు కూడా మూర్తి గురించి తెలుసుకొని సహాయం చేశారు.
కాగా చికిత్స తీసుకుంటున్నా లాభం లేకుండా పోయింది. గత కొన్నిరోజులుగా మూర్తి పరిస్థితి మరింత దిగజారింది. గతంలో నిండు విగ్రహం లాగా పుష్టిగా కనిపించిన ఆయన క్యాన్సర్ బారిన పడి బక్క చిక్కిన తర్వాత పలు టీవీ, యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. దీంతో ఆయనను చూసి చాలా మంది ఇలా అయిపోయారేంటి అంటూ బాధపడ్డారు. ఇప్పుడు ఆయన మరణ వార్త తెలుసుకున్న వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా మూర్తి మరణ వార్తతో సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న నటీనటులు, జబర్దస్త్ కమెడియన్లు మూర్తి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
