Srinu Vaitla: మరోసారి ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్న శ్రీను వైట్ల..
మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్. ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు శ్రీనువైట్ల.

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా తన మార్క్ చూపించాడు శ్రీను వైట్ల. తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కామెడీ ఎంటర్టైమెంట్స్ తో పాటు పవర్ ఫుల్ కంటెంట్ తో సినిమాలు తెరకెక్కించి ఆకట్టుకున్నాడు శ్రీనువైట్ల. ఇక ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. మహేష్ బాబు హీరోగా వచ్చిన దూకుడు సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు ఒకప్పటి ఈ స్టార్ డైరెక్టర్. ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు శ్రీనువైట్ల. చాలా కాలం తర్వత శ్రీనువైట్ల విష్ణు మంచు తో సినిమా చేస్తున్న అని అనౌన్స్ చేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబోలో ఢీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు మరోసారి ఢీ అంటే ఢీ అనే సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. కానీ ఈ సినిమా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు మాస్ మహారాజ హీరోగా ఓ సినిమా చేయనున్నాడట శ్రీనువైట్ల. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన అమర్ అక్బర్ అంథోని సినిమా దారుణంగా నిరాశపరిచింది. తాజాగా శ్రీను వైట్ల రవితేజ కు ఓ కథను వినిపించాడట కథ నచ్చడంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు శ్రీను వైట్లతో మరో సినిమా చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా టాక్. త్వరలోనే ఈ కాంబినేషన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
