AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anaganaga Oka Raju Teaser: నవీన్ పొలిశెట్టి ఈజ్ బ్యాక్.. పొట్టచెక్కలయ్యేలా ‘అనగనగా ఒకరాజు’ టీజర్..

తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరో నవీన్ పోలిశెట్టి. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతిరత్నాలు సినిమాతో తెలుగు అడియన్స్ కు దగ్గరైన నవీన్.. ఆ తర్వాత వరుస సినిమాలు అనౌన్స్ చేశాడు. కొన్నాళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన నవీన్.. ఇప్పుడు అనగనగా ఒకరాజు సినిమాతో అలరించనున్నాడు.

Anaganaga Oka Raju Teaser: నవీన్ పొలిశెట్టి ఈజ్ బ్యాక్.. పొట్టచెక్కలయ్యేలా 'అనగనగా ఒకరాజు' టీజర్..
Naveen Polishetyy
Rajitha Chanti
|

Updated on: Dec 26, 2024 | 2:42 PM

Share

డైరెక్టర్ అనుదీప్ కెవి తెరకెక్కించిన జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో నవీన్ పొలిశెట్టి. అప్పటివరకు కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలలో కనిపించిన నవీన్.. ఈ సినిమాతో హీరోగా మారాడు. కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో తనదైన నటనతో కడుపుబ్బా నవ్వించాడు. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. ఇందులో నవీన్ జోడిగా అనుష్క నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సైతం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు తన కొత్త సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అదే అనగనగా ఒకరాజు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. గతంలో ఓ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ప్రీ వెడ్డింగ్ వీడియో అంటూ విడుదల చేసిన ఈ వీడియో నిడివి కేవలం మూడు నిమిషాల 2 సెకన్లు మాత్రమే ఉంది.

ఇక ఈ వీడియోలో నవీన్ పోలిశెట్టి తనదైన కామెడీతో మరోసారి నవ్వించారు. ముకేష్ మామయ్య .. నీకు వద్ద రిచార్జులు అంటూ అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన అతిథుల గురించి నవీన్ మాట్లాడడం నవ్వులు పూయిస్తోంది. మొత్తానికి మరోసారి అనగనగా ఒకరాజు అంటూ నవీన్ పోలిశెట్టి నవ్వించడం ఖాయమని టీజర్ ద్వారా తెలియజేశారు మేకర్స్. కొన్నాళ్ల క్రితం యాక్సిడెంట్ గురైన నవీన్ పోలిశెట్టి.. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఇటీవలే కోలుకున్న ఆయన మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.