AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coolie: రజినీకాంత్ ‘కూలీ’ సినిమాకు పైరసీ తలనొప్పి.. లీకైన యాక్షన్ సీన్స్

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రజినీకాంత్ 'కూలీ' సినిమాకు పైరసీ తలనొప్పిగా మారింది.

Coolie: రజినీకాంత్ 'కూలీ' సినిమాకు పైరసీ తలనొప్పి.. లీకైన యాక్షన్ సీన్స్
coolie
Rajeev Rayala
|

Updated on: Sep 18, 2024 | 11:04 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రజినీకాంత్ ‘కూలీ’ సినిమాకు పైరసీ తలనొప్పిగా మారింది. బడా సినిమాలను నుంచి హీరో లుక్స్ , యాక్షన్ సీన్స్, లేదా సాంగ్స్ ఇలా ఎదో ఒకటి లీక్ అవుతూ ఉంటాయి. తాజాగా కూలీ సినిమా నుంచి కొన్ని సీన్స్ ఇప్పుడు లీక్ అయ్యాయి. సినిమాకు సంబందించిన కొన్ని యాక్షన్ సీన్స్ లీక్ అయ్యాయని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : పట్టుకుంటే కందిపోతుందేమో ఈ చిన్నది.. జయం సినిమా చిన్నది ఎంత అందంగా ఉందో..!

నాగార్జునకు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు లీక్‌ అయ్యాయి. సినిమా షూటింగ్ జరుగుతుండగానే సోషల్ మీడియాలో మూవీ సీన్స్‌ ప్రత్యక్షమయ్యాయి . సినిమా షూటింగ్‌ స్పాట్‌ నుంచే వీడియోలు లీకైనట్టు తెలుస్తోంది. కాగా వీడియోల లీక్‌పై డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కష్టాన్ని దోచుకుంటున్నారని లోకేష్ కనగరాజు అన్నారు. సినిమా సీన్స్ లీక్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. దయచేసి వీడియోలు వైరల్ చేయొద్దు అని లోకేష్ కోరారు.

ఇది కూడా చదవండి :Samantha : ఇండస్ట్రీలో ఆయనే నాకు గురువు.. స్టార్ హీరో పై ప్రేమ కురిపించిన సామ్

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది నటీనటులు కూడా చేస్తున్నారు. అలాగే శ్రుతిహాసన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింమ్స్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు ఇలా సీన్స్ లీక్ అవ్వడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..