Petrol Prices: పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ ఊరట.. త్వరలో తగ్గే అవకాశం.. రీజన్ ఏంటంటే..?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. 10 రోజుల్లోనే నాలుగుసార్లు ధరలు పెరిగి షాకిచ్చాయి. దీంతో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనే వార్తల క్రమంలో ఊరటనిచ్చే వార్త బయటకు వచ్చింది. ముడి చమురు ధరలు తగ్గుతుండటం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నాలుగోసారి పెరిగాయి. పది రోజుల్లోనే నాలుగుసార్లు ధరలు పెరగడంతో వాహనదారులతో పాటు సామాన్యులపై ప్రభావం పడుతుంది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం క్రమంలో హర్ముజ్ జలసంధి నుంచి రాకపోకలు నిలిపివేడయం, రవాణాకు అంతరాయం కలగడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. దేశంలో చమురు కంపెనీలు ముడి చమురు కొనుగోలు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో దేశంలో ఇంధన ధరలు వరుసగా పెరుగుతూ వస్తోన్నాయి. ఒకేసారి పెంచకుండా దశలవారీగా కేంద్రం ధరలను పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందనే వార్తలు వస్తోన్నాయి.
ట్రంప్ ప్రకటనతో ఊరట..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రకటనలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయి. తాజాగా అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందానికి చాలా దగ్గరిలో ఉన్నాయని ట్రంప్ ప్రకటించారు. అమెరికా-ఇరాన్ యుద్దం శాంతి ఒప్పందం కుదిరిందని, దానిని ఖరారు చేస్తున్నామని అన్నారు. హర్ముజ్ జలసంధిని త్వరలో తెరుస్తారని, దీనిపై తాను చర్చలు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రకటన తర్వాత ముడి చమురు ధరలు తగ్గాయి. బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే దిగువకు చేరుకున్నాయి. ఇటీవల 100 డాలర్లపైనే కొనసాగుతూ వస్తోండగా.. ఇప్పుడు ఒక్కసారిగా కప్పకూలాయి. ప్రస్తుతం బ్రెంట్ క్యూడ్ ఆయిల్ ధర 98 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు తగ్గుతాయా..?
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా త్వరలో దిగొచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముడి చమరు ధరల్లోని హెచ్చుతగ్గులు పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 1 డాలర్ పెరిగే ఇంధన ధరలు లీటర్‌కు సగటును 50 నుంచి 60 పైసల వరకు పెరుగుతాయి. ప్రస్తుతం వాటి ధరలు తగ్గడంతో.. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గనున్నాయని చెప్పవచ్చు. ఇదే జరిగితే సామాన్యులకు కాస్త ఊరట కలగనుంది. కాగా హర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. శ్రీలకం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో అయితే భారీగా పెరిగింది. కానీ ఇండియాలో ధరలు స్వల్పంగానే పెరిగాయి.
