AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monalisa Bhosle: ఆయన షూటింగ్ సెట్‌లో అసభ్యకరంగా ప్రవర్తించాడు.. మరో బాంబ్ పేల్చిన మెనాలిసా

'ది డైరీ ఆఫ్ మణిపూర్' సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ సరోజ్ మిశ్రా తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కుంభమేళా బ్యూటీ మోనాలిసా భోస్లే షాకింగ్ ఆరోపణలు చేసింది. ఈ విషయం గురించి తన ఫ్యామిలీకి చెప్పినా పెద్దగా పట్టించుకోలేదంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

Monalisa Bhosle: ఆయన షూటింగ్ సెట్‌లో అసభ్యకరంగా ప్రవర్తించాడు.. మరో బాంబ్ పేల్చిన మెనాలిసా
Monalisa Bhosle
Basha Shek
|

Updated on: May 02, 2026 | 12:52 PM

Share

కుంభమేళాతో పూసలమ్ముతూ కనిపించిన మోనాలిసా ఓవర్ నైట్ లోనే సెలబ్రిటీగా మారిపోయింది. తన క్యూట్ లుకింగ్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోంది. దెబ్బకు సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. దీంతో ఆ పేద అమ్మాయికి భలే అదృష్టం కలిసివచ్చిందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మోనాలిసా తన వ్యక్తిగత జీవితంతో వరుసగా వార్తల్లో నిలుస్తోంది. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఫర్మాన్ ఖాన్ ను మోనాలిసా వివాహం చేసుకోవడం, ఆపై పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం హాట్ టాపిక్ అయ్యాయి. ఇక మోనాలిసా మైనర్ అని ఆమె కుటుంబ సభ్యులు ఫర్మాన్‌ పై కేసు కూడా పెట్టారు. ఈ వివాదం కొనసాగుతుండగానే మోనాలిసా మరో బాంబు పేల్చింది. సినిమా షూటింగ్ లో తాను చేదు అనుభవాలను ఎదుర్కొన్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్ సరోజ్ మిశ్రా తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ పోలీసులను ఆశ్రయించిందీ అందాల తార. మోనాలిసా ఫిర్యాదు మేరకు ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టంలోని తీవ్రమైన సెక్షన్ల కింద నలుగురిపై కేసు నమోదైంది. ఈ ఫిర్యాదులో ఆమె సినీ పరిశ్రమ, ఇతర రంగాలకు చెందిన వారిపై సంచలన ఆరోపణలు చేసింది. మోనాలిసా దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు, న్యాయవాది అనిల్ విలయిల్ పేరు కూడా ఉంది. అలాగే సినీ దర్శకుడు సనోజ్ మిశ్రాపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేసింది మోనాలిసా. పీటీఐ ప్రకారం, సంబంధిత ఎఫ్‌ఐఆర్‌ను 2026 ఏప్రిల్ 29న దాఖలు చేశారు.

‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమా షూటింగ్ సమయంలో తాను చేదు అనుభవాలను ఎదుర్కొన్నానంటూ మోనాలిసా తన ఫిర్యాదులో పేర్కొంది. కొచ్చిలో జరిగిన ఒక సమావేశంలో, దర్శకుడు సనోజ్ మిశ్రా తనను చాలాసార్లు అసభ్యకరంగా తాకారని ఆమె ఆరోపించింది. ‘దర్శకుడు నన్ను 10 సార్లు దారుణంగా తాకాడు. ఈ విషంలో నా కుటుంబం కూడా నాకు మద్దతు ఇవ్వలేదు. నేను ఈ విషయం గురించి మా కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు, వారు కనీసం పట్టించుకోలేదు’ ‘ అని మోనాలిసా వాపోయింది. అందిన సమాచారం ప్రకారం, మోనాలిసా ఏప్రిల్ 30, గురువారం నాడు కోర్టులో హాజరై తన అధికారిక వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ సంఘటనలు మధ్యప్రదేశ్‌లో జరిగినందున, ఈ కేసును మధ్యప్రదేశ్ పోలీసులకు బదిలీ చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మోనాలిసా, ఫర్మాన్‌ల పెళ్లిని వ్యతిరేకిస్తూ, వారి కుటుంబం ‘లవ్ జిహాద్’ ఆరోపణలు చేసింది. మోనాలిసాను ప్రలోభపెట్టి ఫర్మాన్‌ ఖాన్ పెళ్లి చేసుకున్నారని వారు ఆరోపించారు. అయితే, మోనాలిసా మొదటి నుంచి తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. అంతేకాకుండా, తాను పూర్తి మానసిక స్థితిలోనే ఉన్నానని ఆమె చెబుతోంది. ఇప్పుడు మోనాలిసా వ్యవహారంలో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us