నన్ను కాదని ఆ హీరోయిన్‌ను తీసుకుంటారా.? ఆ సినిమా విషయంలో త్రిష గొడవ
మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో “సంక్రాంతి రాజు” గా పేరొందిన మెగా మేకర్ ఎం. ఎస్. రాజు దర్శకుడిగానూ ప్రతిభ చాటుతున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు న నిర్మించిన ఎం. ఎస్. రాజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు

ప్రముఖ చిత్ర నిర్మాత ఎం.ఎస్. రాజు తన సినీ ప్రస్థానంలోని కొన్ని మరచిపోలేని అనుభవాలనుఅలాగే పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తన కెరీర్ మొదట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” చిత్రానికి తనను ఎందుకు ఎంపిక చేయలేదని అడిగారని, ఆ పాత్రకు సరిపోడని తాను చెప్పినట్లు వివరించారు ఎం.ఎస్. రాజు. “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” సినిమా షూటింగ్ సమయంలో, యూనిట్‌లోని ప్రభుదేవా, కెమెరామెన్ వేణుతో సహా అందరికీ అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉండగా, తనకు మాత్రం ఆ నమ్మకం లేదని ఎం.ఎస్. రాజు అన్నారు. ఒకానొక దశలో, 250 మంది యూనిట్‌తో అరకులో ఉన్నప్పుడు, ఆయన షూటింగ్‌ను నిలిపివేసి, స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరచడానికి ఒక నెలపాటు విరామం తీసుకున్నారట. ఈ సమయంలో వివిధ చిత్రాల నుండి స్ఫూర్తి పొంది, క్లైమాక్స్‌ను మళ్లీ రాశారట. ముఖ్యంగా, క్లైమాక్స్‌లో సిద్ధార్థ్, త్రిషల పెళ్లిని శ్రీహరి ముందు జరిపించే సన్నివేశం షూటింగ్ జరుగుతున్నప్పుడే అనుకోని, అక్కడికక్కడే పెళ్లి బట్టలు తెప్పించి చిత్రీకరించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి : సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ
త్రిషతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ఆమె తన ఆల్ టైమ్ ఫేవరెట్ అని, తన పట్ల అద్భుతమైన గౌరవం, నిబద్ధత చూపేది పేర్కొన్నారు. త్రిషను మొదటిసారి కలిసినప్పుడు, ఆమెకు “చిన్న టమ్మీ ఉంది, ఎక్సర్సైజ్ చెయ్” అని చెప్పినట్లు తెలిపారు. త్రిష స్క్రిప్ట్‌ను ముందుగా చదవడానికి ఒప్పుకునేది కాదు, “ఇది ఎం.ఎస్. రాజు సినిమా, స్పాట్‌లో సీన్ చెప్పండి చాలు” అని అనేది. 75 రోజులపాటు “వర్షం” షూటింగ్‌లో వర్షంలో తడిసి, “నావల్ల కాదు” అని ఏడ్చినప్పటికీ, ఆతర్వాత “నేను చేస్తాను” అని మొండిగా పనిచేసిన ఆమె అంకితభావం అపూర్వమని కొనియాడారు. “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” సినిమాకు డేట్స్ కావాలని అడగగానే, త్రిష నేరుగా ఎయిర్‌పోర్ట్ నుంచి తన ఇంటికి వచ్చి, భోజనం చేసి, షెడ్యూల్ బుక్‌ను ఇచ్చి “మీకు ఎప్పుడు కావాలో చెప్పండి” అని చెప్పడం తన జీవితంలో మర్చిపోలేని అనుభవం అని వివరించారు ఎం.ఎస్. రాజు.
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. తారక్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను
అలాగే ఆట సినిమా కోసం ఇలియానాని ఎంపిక చేసినప్పుడు, త్రిష తనపై అలిగి, ఫోన్‌లు చేసి షూటింగ్‌కి వచ్చేస్తానని చెప్పిందని, అయితే రాజమండ్రిలో బోట్‌లో షూటింగ్ జరుగుతున్నందున అది సాధ్యం కాదని చెప్పి, రాత్రి కార్లో తిరిగి వెళ్లేటప్పుడు ఆమెను ఓదార్చినట్లు వివరించారు. శ్రీహరి “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” సినిమాలో అన్న పాత్రను పోషించడానికి మొదట సంశయించినప్పటికీ, కథ వినగానే ఆయన కళ్ళల్లో నీళ్లు వచ్చాయని, డబ్బు గురించి అడగకుండానే సినిమాకు ఒప్పుకున్నారని తెలిపారు. కేవలం వారం రోజుల్లోనే, శ్రీహరి తన పాత్రకు అవసరమైన దుస్తులు, పంచె, కేశాలంకరణ, బొట్టు వంటి నాలుగు విభిన్నమైన లుక్‌లను సొంతంగా డిజైన్ చేసుకుని పంపించారని, ఆయన అంకితభావం, భావోద్వేగం అద్భుతమని ఎం.ఎస్. రాజు ప్రశంసించారు. తన చిత్రాలలో పనిచేసిన సిద్ధార్థ్, త్రిష, శ్రీహరి, ప్రభుదేవా వంటి ప్రతి ఒక్కరు తన కుటుంబ సభ్యులలాంటి వారే అని ఆయన పేర్కొన్నారు.




