L2 : Empuraan : స్టార్ హీరో సినిమాకు షాక్.. విడుదలైన గంటల్లోనే HD ప్రింట్ లీక్.. వారిపైనే అనుమానాలు..
దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారింది పైరసీ భూతం. సినిమా విడుదలకు ముందే పలు చిత్రాలకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో లీక్ అవుతుంటారు. ఇక భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు గంటల వ్యవధిలోనే ఆన్ లైన్ లో ప్రత్యేక్షమవుతుంటాయి. తాజాగా మలయాళీ స్టార్ హీరో సినిమాకు షాక్ తగిలింది.

మలయాళీ స్టార్ హీరోస్ మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన లేటేస్ట్ మూవీ L2 : ఎంపురాన్. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా HD ప్రింట్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడం చూసి అభిమానులు, సినీప్రియులు షాకయ్యారు. ఈ ప్రింట్ సినిమా థియేటర్ నుంచి కాపీ చేయలేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా మలయాళం, హిందీ, తమిళ వెర్షన్లు ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్నాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే, ప్రింట్లు టెలిగ్రామ్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలోకి వచ్చాయి. థియేటర్లలో విడుదలైన సినిమాల నకిలీ వెర్షన్లు తరచుగా ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతాయి.
అయితే ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యే సినిమాలు నాణ్యత తక్కువగా ఉంటుంది. ఈ వెర్షన్‌లు సాధారణంగా పేలవమైన విజువల్స్, సౌండ్ కలిగి ఉంటాయి. ఎంపురాన్ సినిమాగా చక్కర్లు కొడుతున్న నకిలీ వెర్షన్ 1080 పిక్సెల్ ఫుల్ HD ప్రింట్ అని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇవి థియేటర్ నుంచి లీక్ అయ్యే అవకాశం లేదని సైబర్ నిపుణులు అంటున్నారు. ఈ సినిమాతో సంబంధం ఉన్న వారి నుండే ఈ సినిమా లీక్ అయిందనే అనుమానం ఉంది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందితే దర్యాప్తు ప్రారంభిస్తామని కొచ్చి సైబర్ పోలీసులు ప్రకటించారు. నకిలీ వెర్షన్లను వ్యాప్తి చేసే వారిని కనుగొనడానికి ప్రొఫెషనల్ ఎథికల్ హ్యాకర్లను నియమించినట్లు కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తెలిపింది.
పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఎంపురాన్, లూసిఫెర్ ఫిల్మ్ సిరీస్‌లో రెండవ భాగం. ఈ సిరీస్‌లో మొదటి చిత్రం ఎంపురాన్ 2019లో విడుదలైంది. ఎంపురాన్ చిత్రానికి మురళి గోపి స్క్రిప్ట్ రాశారు. ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, సుభాస్కరన్, గోకులం గోపాలన్ నిర్మించారు. దీపక్ దేవ్ సంగీత దర్శకత్వం. పృథ్వీరాజ్, మంజు వారియర్, టోవినో థామస్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్, సానియా అయ్యప్పన్, శివద, తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ నెల 27న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..