బుట్టబొమ్మపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రోజా భర్త.. స్టార్ డమ్‌ రాగానే మారిపోయిందని విమర్శలు..

బుట్టబొమ్మపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రోజా భర్త.. స్టార్ డమ్‌ రాగానే మారిపోయిందని విమర్శలు..
Director Rk Selvamani

RK Selvamani Fire On Pooja Hegde: నటి, ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్‌ పూజాహెగ్డేపై ఫైర్ అయ్యారు.

uppula Raju

|

Aug 21, 2021 | 5:56 AM

RK Selvamani Fire On Pooja Hegde: నటి, ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్‌ పూజాహెగ్డేపై ఫైర్ అయ్యారు. స్టార్‌డమ్‌ రాగానే పూజాహెగ్డే ఎంతో మారిపోయిందని విమర్శించారు. ఆమె వల్ల నిర్మాతలపై అదనపు భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెతో పాటు 12 మందిని లోకేషన్‌కి తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. దీనివల్ల నిర్మాతలు ఖర్చు భరించలేక తీవ్ర నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సెల్వమణి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ.. ‘సాధారణంగా లొకేషన్‌కు వచ్చేటప్పుడు పూజాహెగ్డే తన వెంట ఓ అసిస్టెంట్‌ని తీసుకువచ్చేది. షూటింగ్‌ సమయంలో మేకప్‌, డ్రెస్సింగ్‌, ఇతర అవసరాలు అతనే చూసుకునేవాడు. కానీ, ఇటీవల వచ్చిన స్టార్‌డమ్‌తో ఆమె తీరు ఎంతో మారింది. లొకేషన్‌కు వచ్చేటప్పుడు ఏకంగా 12 మందిని ఆమె వెంట తెచ్చుకుంటుంది. అంతమంది అవసరం ఏముందో అర్థం కావడం లేదు. అనవసరంగా ఎక్కువమంది అసిస్టెంట్స్‌ని వెంట తెచ్చుకోవడం వల్ల నిర్మాతలపై విపరీతంగా ఆర్థిక భారం పడుతోందని’ అన్నారు. అయితే సెల్వమణి నిర్మాతల పక్షాన మాట్లాడినట్లు చాలా స్పష్టంగా తెలుస్తుంది.

పూజా హెగ్డే తెలుగు సినిమాలో బిజీగా ఉండే నటీమణులలో ఒకరు. ఆమె ప్రభాస్‌తో నటించిన రాధే శ్యామ్ వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన SSMB28 లో కూడా ఆమె మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. మహర్షి తర్వాత మహేష్ బాబుతో ఇది ఆమెకి రెండో సినిమా. అరవింద సమేత, అలా వైకుంఠపురం తర్వాత త్రివిక్రమ్‌తో ఇది ఆమెకు మూడో సినిమా. ఇది కాకుండా అఖిల్ అక్కినేనితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం జత కట్టిన విషయం తెలిసిందే. అది విడుదలకు సిద్దంగా ఉంది. తమిళ సూపర్‌స్టార్ విజయ్‌ సినిమా బీస్ట్ తో కోలీవుడ్‌లో కూడా అడుగుపెడుతోంది.

బంపర్‌ ఆఫర్ కొట్టేసిన బబ్లీ బ్యూటీ.. ధనుష్‌ సరసన హీరోయిన్‌గా అవకాశం.. ఎవరో తెలుసా..?

Megha Akash: ముద్దుగుమ్మ మేఘ ఆకాష్ తిరిగి తెలుగులో రాణించేనా..? అమ్మడి ఆశలన్నీ ఆ సినిమాలపైనే..

Indraganti Mohan Krishna: నిర్మాతగా మారనున్న మరో దర్శకుడు.. ఇంద్రగంటి ఎవరితో సినిమా చేస్తున్నారో తెలుసా..?

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu