Andamaina Lokam: ఆకట్టుకునే ప్రేమ కథతో రానున్న అందమైన లోకం.. త్వరలోనే రెగ్యులర్ షూట్

Andamaina Lokam: ఆకట్టుకునే ప్రేమ కథతో రానున్న అందమైన లోకం.. త్వరలోనే రెగ్యులర్ షూట్

సహస్ర ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ వెంకీ, వర్ష విశ్వనాథ్, చాందిని భగవాని హీరో, హీరోయిన్స్‌గా  మోహన్ మర్రిపెల్లి  దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర నాయుడు నిర్మిస్తున్న చిత్రం  "అందమైన లోకం". తాజాగా

Rajeev Rayala

|

Aug 20, 2021 | 9:44 PM

Andamaina Lokam: సహస్ర ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ వెంకీ, వర్ష విశ్వనాథ్, చాందిని భగవాని హీరో, హీరోయిన్స్‌గా  మోహన్ మర్రిపెల్లి  దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర నాయుడు నిర్మిస్తున్న చిత్రం  “అందమైన లోకం”. తాజాగా ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత కూతురు సహస్ర హీరో, హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, డాక్టర్ రవీంద్ర నాయుడు కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు మోహన్ మర్రిపెల్లి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఇంకా ఈ కార్యక్రమానికి మడత కాజా డైరెక్టర్  సీతారామరాజు, గుంటారోడు డైరెక్టర్ సత్యరాజ్, సభకు నమస్కారం డైరెక్టర్ సతీష్ మల్లంపాటిలు హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం చిత్ర దర్శకుడు మోహన్ మరిపెల్లి మాట్లాడుతూ..” ఇప్పటి వరకు నేను 100 కు పైగా షార్ట్ ఫిలిమ్స్ చేశాను. షార్ట్ ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ నుండి వస్తున్న నేను ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టొరీ తయారు చేసుకొని నిర్మాతకు చెప్పడం జరిగింది. నిర్మాతకు ఈ కథ నచ్చడంతో నామీద నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాడు.  మంచి బ్యూటిఫుల్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రెండు లవ్ స్టోరీస్ ఉంటాయి. ప్రస్తుతం లవ్‌లో ఉన్న వారు, లవ్ ఫెయిల్యూర్ అయినవారు కానీ, లవ్‌లో పడాలి అనుకునే వారికి కానీ… ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. ట్విస్ట్ & టర్న్స్‌తో మంచి మెసేజ్‌తో వస్తున్న ఈ “అందమైన లోకం” ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా ఉంటుంది అన్నారు.

హీరో డాక్టర్ వెంకీ మాట్లాడుతూ… దర్శకుడు మోహన్ మర్రిపెల్లి గత 5 సంవత్సరాలుగా మంచి ఫ్రెండ్ తను మంచి మంచి లవ్ స్టోరీస్ తీసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటాడు. ఈ టీంతో నేను ఎప్పటినుండో కనెక్ట్ అవుతూ వస్తూన్నాను. మేమందరూ కలసి మంచి సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. రొటీన్ లవ్ స్టొరీ కాకుండా ప్రేక్షకులకు డిఫరెంట్ మూవీని పరిచయం చేద్దామని ఓ బ్యూటిఫుల్ లవ్ స్టొరీని తయారు చేసుకొన్నాం. తరువాత ఈ కథ నిర్మాతకు నచ్చడంతో  నిర్మాత సహకారంతో  మంచి టీంను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా చేస్తున్నాము. ఈ కరోనా టైం లో లవ్ స్టొరీ కథలు చాలా వున్నా ఇలాంటి డిఫరెంట్ లవ్ స్టొరీలో హీరోగా నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఫ్యామిలీ ఆడియన్స్‌కే కాక అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

హీరోయిన్ వర్ష విశ్వనాథ్ మాట్లాడుతూ…  మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీలో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. మంచి టీమ్ తో వస్తున్న మా టీం కు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని అన్నారు. అలాగే హీరోయిన్ చాందిని భగవాని మాట్లాడుతూ… రథం, దిక్సూచి, చిత్రాల తర్వాత నేను చేస్తున్న మూడవ సినిమా “అందమైన లోకం” . ఫుల్ లవ్ అండ్ కామెడీ  ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. మంచి టీమ్ తో వస్తున్న ఈ సినిమాలో నాకీ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bandla Ganesh: బండ్లేశ్వరా..! 48 ఏళ్ల వయస్సులో హీరోగా టర్న్.. ఆ హిట్ సినిమాకు రీమేక్.. సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్‌

Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌కు క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఢిల్లీ సుందరి..

Aakaasam Nee Haddhu Ra : సూర్య సినిమాకు అవార్డుల పంట.. మారో ఘనత సాధించిన ఆకాశం నీ హద్దురా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu