AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas Movie: ప్రభాస్‌ మూవీలో ఇండియా పాక్‌ యుద్ధం.. యాక్షన్‌ సీన్‌లు నెక్ట్స్‌ లెవల్‌లో ఉండనున్నాయంటా..

Prabhas Movie: బాహుబలి తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ ఒకేసారి పెరిగిపోయింది. ప్రభాస్‌ ఒక్కసారి నేషనల్ హీరోగా మారాడు. ఇప్పుడు ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఎక్కడ లేని..

Prabhas Movie: ప్రభాస్‌ మూవీలో ఇండియా పాక్‌ యుద్ధం.. యాక్షన్‌ సీన్‌లు నెక్ట్స్‌ లెవల్‌లో ఉండనున్నాయంటా..
Prabhas
Narender Vaitla
|

Updated on: Aug 20, 2021 | 9:02 PM

Share

Prabhas Movie: బాహుబలి తర్వాత ప్రభాస్‌ రేంజ్‌ ఒకేసారి పెరిగిపోయింది. ప్రభాస్‌ ఒక్కసారి నేషనల్ హీరోగా మారాడు. ఇప్పుడు ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఎక్కడ లేని అంచనాలు నెలకొంటున్నాయి. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్‌కు వస్తోన్న అవకాశాలు, ఆయన ఓకే చెబుతోన్న కథలు కూడా ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌తో ఆదిపురుష్‌, కేజీఎఫ్ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సలార్‌ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలు కూడా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. ఇక ప్రభాస్‌ నటించిన తాజా చిత్రం రాధే శ్యామ్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

Salaar Movie

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్‌ చిత్రానికి సంబంధించి ఓ చిన్న వార్త వచ్చినా నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సలార్‌ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో భారత్‌, పాక్‌ యుద్ధానికి సంబంధించి సన్నివేశాలు ఉండనున్నాయనేది సదరు వార్త సారంశం. కథకు అనుగుణంగా ఈ సినిమాలో 1971లో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధాన్ని చూపించనున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే యాక్షన్‌ సీన్‌లు ఓ రేంజ్‌లో ఉండనున్నాయని వార్త హంగామా చేస్తోంది. ఈ వార్త తెలిసిన ప్రభాస్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ ఒక చిన్న స్థాయి నుంచి నాయకుడి రేంజ్‌కి ఎలా ఎదిగాడన్న అంశాన్నే సినిమా ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఇటీవల సలార్‌ చిత్రానికి లీకుగాళ్లు తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించి కొన్ని సన్నివేశాలు నెట్టింట లీక్‌ అయ్యాయి. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన చిత్ర యూనిట్‌ పోలీసులను ఆశ్రయించింది. దాదాపు ఇండియాలోని అన్ని భాషల్లో విడుదలవుతోన్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Kartikeya Gummakonda : షూటింగ్ కంప్లీట్ చేసిన కార్తికేయ.. త్వరలో రాజా విక్రమార్కగా ప్రేక్షకుల ముందుకు..

EV Recharge: ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ఛార్జింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది..ఎంత సమయం పడుతుంది తెలుసా?

Covid 19 Vaccine: గుడ్ న్యూస్.. దేశంలోకి మరో కరోనా వ్యాక్సిన్.. అనుమతి ఇచ్చిన డీసీజీఐ