Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV Recharge: ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ఛార్జింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది..ఎంత సమయం పడుతుంది తెలుసా?

ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల యుగం. ఇప్పుడు ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా, ప్రజలు ప్రత్యామ్నాయాల కోసం వెదుకుతున్నారు.

EV Recharge: ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ఛార్జింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది..ఎంత సమయం పడుతుంది తెలుసా?
Electric Vehicles
Follow us
KVD Varma

|

Updated on: Aug 20, 2021 | 8:28 PM

EV Recharge:  ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల యుగం. ఇప్పుడు ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా, ప్రజలు ప్రత్యామ్నాయాల కోసం వెదుకుతున్నారు. అందులో ప్రస్తుతం విద్యుత్ఎం వాహనాల వైపే అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే ఇంధనం కంటే ఇది చాలా చౌకైన ఇంధనం. మనదేశంలో కూడా చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేశారు. పెట్రోల్ పంపుల లానే  ఎలక్ట్రిక్ స్టేషన్లను దేశవ్యాప్తంగా ప్రవేశ పెట్టడం కోసం ప్రభుత్వం కూడా సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఒకవేళ మీరు కూడా ఎలక్ట్రిక్ కారును తీసుకోవాలని ఆలోచిస్తుంటే, మీరు ఎలక్ట్రిక్ కారును ఎలా ఛార్జ్ చేయాలో తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా, ఈ ఎలక్ట్రిక్ స్టేషన్లలో ఛార్జ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? అదేవిధంగా పెట్రోల్, డీజిల్ కంటే ఎలక్ట్రిక్ ఎంతవరకూ చౌకగా ఉంటుంది? ఇటువంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ కోసం ముంబైలో, వాహనం యూనిట్‌కు రూ .15 ఛార్జ్ చేయబడుతుంది. అదే సమయంలో, ఢిల్లీలో లాన్ టెన్షన్ ఛార్జింగ్ కోసం యూనిట్‌కు రూ. 4.5 వసూలు చేస్తున్నారు.  హై టెన్షన్ వాహనాల కోసం యూనిట్‌కు రూ. 5 వసూలు చేస్తారు. అందుకే ఢిల్లీలో  ఈ విద్యుత్ చాలా చౌకగా ఉంటుంది, మీ కారు 120 నుండి 150 రూపాయలతో  పూర్తిగా ఛార్జ్ అయిపోతుంది.

సీఎన్బీసీ  నివేదిక ప్రకారం, బీఎంసి  ఈ రేటు గురించి సమాచారాన్ని ఇస్తుంది. ఇంధన ట్యాంక్ గురించి తెలుసుకుంటే.. సాధారణంగా  మొత్తం వాహనాన్ని ఛార్జ్ చేయడానికి 20 నుండి 30 యూనిట్లు పడుతుంది. దీని అర్థం మీరు వాహనాన్ని ఛార్జ్ చేయడానికి 200 నుండి 400 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే, మీరు రూ .400 ఖర్చుతో ఒకసారి వాహనాన్ని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

కార్ల విషయం పక్కన పెడితే.. ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా ఇదే విధానంలో ఛార్జ్ చేయించుకోవచ్చు.  స్కూటర్‌ను ఛార్జ్ చేయడానికి 3 యూనిట్ల విద్యుత్ పడుతుంది. అంటే, స్కూటర్ పూర్తిగా రూ .50 కి ఛార్జ్ చేయవచ్చు. ఇప్పుడు మీరు పూర్తి ఛార్జ్‌లో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అనేది మీ వాహనంపై ఆధారపడి ఉంటుంది.

ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది?

ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ రెండు రకాలు. దీనిలో, వేగవంతమైన ఛార్జింగ్ ఉంది. దీని కారణంగా బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 60 నుండి 110 నిమిషాలు పడుతుంది. నెమ్మదిగా ఛార్జ్ అవుతుంది, దీని కారణంగా వాహనాన్ని ఛార్జ్ చేయడానికి 6 నుండి 7 గంటలు పడుతుంది. దీనిని ప్రత్యామ్నాయ ఛార్జ్ అని కూడా అంటారు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది?

ఇది ప్రతి కారు ఇంజిన్‌పై ఆధారపడి ఉన్నప్పటికీ, సాధారణంగా  15 KMH బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఒక కారును 100 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. చాలా కార్లు దీని కంటే తక్కువ సగటును ఇస్తాయి. కానీ ఈ ప్రమాణం ప్రమాణంగా పరిగణిస్తున్నారు.  అటువంటి పరిస్థితిలో, మీరు దానిని ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ప్రకారం అంచనా వేయవచ్చు. మరోవైపు, కొన్ని టెస్లా కార్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా నడుస్తాయి. ఏది ఏమైనా ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్న కార్ల పరిస్థితిని గమనిస్తే.. కిలోమీటర్ కు ఒకటి రూపాయి కన్నా తక్కువ ఖర్చు వస్తుంది. అదే స్కూటర్ కి అయితే 20 పైసల నుంచి 30 పైసల వరకూ కిలోమీటర్ కు ఖర్చు వస్తుంది.

Also Read: OLA Electric Cars: ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ కార్లు కూడా వచ్చేస్తున్నాయోచ్‌.. అధికారికంగా ప్రకటించిన సీఈఓ. ఎప్పటి నుంచంటే..

WhatsApp: 7 రోజులు కాదు 90 రోజులు.. యూజర్ల కోసం ఆ సమయాన్ని పెంచే ప్రయత్నంలో వాట్సాప్‌.