AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartikeya Gummakonda : షూటింగ్ కంప్లీట్ చేసిన కార్తికేయ.. త్వరలో రాజా విక్రమార్కగా ప్రేక్షకుల ముందుకు..

ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్‌లోనే క్రేజ్ సొంతం చేసుకున్న హీరో కార్తికేయ. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు.

Kartikeya Gummakonda : షూటింగ్ కంప్లీట్ చేసిన కార్తికేయ.. త్వరలో రాజా విక్రమార్కగా ప్రేక్షకుల ముందుకు..
Rajeev Rayala
|

Updated on: Aug 20, 2021 | 8:30 PM

Share

Kartikeya Gummakonda : ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్‌లోనే క్రేజ్ సొంతం చేసుకున్న హీరో కార్తికేయ. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో తన అద్భుత నటనతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడీ యంగ్ హీరో. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం కార్తికేయ హీరోగా ‘రాజా విక్రమార్క’ నిర్మితమవుతోంది. ఈ సినిమాలో ఆయన విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. లవ్-యాక్షన్- ఎమోషన్‌తో కూడిన ఈ సినిమాలో, కార్తికేయ సరసన నాయికగా తాన్య రవిచంద్రన్ నటించింది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల బక్రీద్ సందర్భంగా.. ఈ మూవీ నుంచి మరో పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో కార్తికేయ.. ముస్లిం వేషధారణలో డిఫరెంట్‏ లుక్‏లో కనిపించారు. అయితే హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా రాబోతున్న ఈ సినిమాలో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా నిర్మాత  రామారెడ్డి  మాట్లాడుతూ..”సినిమా పరిశ్రమలో నా మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ల ప్రోత్సాహంతోనే నేను ఈ సినిమాను నిర్మించాను. నిర్మాతగా నేను చేస్తున్న తొలి సినిమా ఇది. ఈ కథ విన్నప్పుడు కార్తికేయ అయితే బాగుంటాడని ఆయనను సంప్రదించడం జరిగింది. ఈ సినిమా ఫంక్షన్‌కి చిరంజీవిగారిని పిలవాలని అనుకుంటున్నాము. ఇక పై మా బ్యానర్లో వరుస సినిమాలు ఉంటాయి అని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bandla Ganesh: బండ్లేశ్వరా..! 48 ఏళ్ల వయస్సులో హీరోగా టర్న్.. ఆ హిట్ సినిమాకు రీమేక్.. సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్‌

Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌కు క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఢిల్లీ సుందరి..

Aakaasam Nee Haddhu Ra : సూర్య సినిమాకు అవార్డుల పంట.. మారో ఘనత సాధించిన ఆకాశం నీ హద్దురా..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్