Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : హీరోయిజం అంటే థియేటర్‌‌లోనే కనపడుతుంది, ఓటీటీలో కనపడదు: థియేటర్ ఓనర్స్

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యాయి. అయితే ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఒకవైపు కొత్త సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటుండగా, మరోవైపు కొన్ని ఓటీటీ బాట

Tollywood : హీరోయిజం అంటే థియేటర్‌‌లోనే కనపడుతుంది, ఓటీటీలో కనపడదు: థియేటర్ ఓనర్స్
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 20, 2021 | 7:54 PM

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యాయి. అయితే ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఒకవైపు కొత్త సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటుండగా, మరోవైపు కొన్ని ఓటీటీ బాట పట్టడం వివాదానికి దారి తీస్తోంది. దీనిపై థియేటర్‌ యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారం పై తెలుగు ఫిలిం ఛాంబర్‌లో తెలంగాణా థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా.. నిర్మాత చదలవాడ మాట్లాడుతూ “రామారావు, నాగేశ్వరరావు ఇప్పుడు లేకపోయినా వాళ్ళ సినిమాలు ఆడిన థియేటర్స్ ఇప్పటికీ వున్నాయి. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ మధ్య అవినాభావ సంబంధం వుంది. సినిమా అనుభూతి అనేది ఓఓటీటీ కన్నా థియేటర్‌లోనే బాగా వుంటుంది. నిర్మాతలకు నా విజ్ఞప్టి ఏమిటంటే ఓటీటీలను ఎవైడ్ చేద్దాం. సెప్టెంబర్ 10న లవ్ స్టోరీ రిలీజ్ అవుతున్నప్పుడు టక్ జగదీష్ అదేరోజు ఓటీటీలో రిలీజ్ చెయ్యడం కరెక్ట్ కాదు“ అన్నారు. అలాగే సునీల్ నారంగ్ మాట్లాడుతూ “గ‌త నెల‌లో డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌ ప్రెస్‌మీట్ పెట్టిన‌ప్పుడు సినిమాల‌ను ఓటీటీల్లో విడుద‌ల చేయ‌వ‌ద్దంటూ రిక్వెస్ట్ చేశాం. అయితే `ట‌క్ జ‌గ‌దీష్‌` నిర్మాత‌లు వారి సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. స‌ద‌రు నిర్మాత‌ల‌కు మేం ఫోన్ చేస్తే ఆయ‌న ఆర్థిక ఇబ్బందులు గురించి చెప్పారు. దీని గురించి ఓ క‌మిటీ వేసి మాట్లాడదామ‌ని అనుకున్నాం. అయితే మేం ల‌వ్‌స్టోరి సినిమాను సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేశాం. కానీ అదే రోజున వాళ్లు ట‌క్‌జ‌గ‌దీష్ సినిమాను అమెజాన్‌లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. నేను సినిమా రిలీజ్ చేసుకుంటాను. నాకు ఎలాంటి స‌మ‌స్య లేదు. అయితే భ‌విష్య‌త్తులో ఇలాగే జరగొద్దు. ఎగ్జిబిట‌ర్ అనేవాడు డిస్ట్రిబ్యూట‌ర్‌కు డ‌బ్బులు క‌ట్ట‌లేడు. అలాగే డిస్ట్రిబ్యూట‌ర్ అనేవాడు ప్రొడ్యూస‌ర్‌కు డ‌బ్బులు క‌ట్ట‌లేడు. చివ‌ర‌కు నిర్మాత‌ల‌కే డ‌బ్బులు రావు.  నిర్మాత‌ల‌కు.. డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌కు మ‌ధ్య రిలేష‌న్ అనేది భార్యాభ‌ర్త‌ల సంబందంలాంటిది. కాబ‌ట్టి మేం నిర్మాత‌ల‌ను స‌పోర్ట్ చేయ‌మ‌ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేం ఓటీటీ ఛానెల్స్‌కు వ్య‌తిరేకం కాదు. వారి బిజినెస్ వారిది. పండుగ‌ల‌కు సినిమాల‌ను ఓటీటీల్లో విడుద‌ల చేయ‌కండి. ల‌వ్‌స్టోరి సినిమాను సాఫీగా విడుద‌ల‌య్యేలా చూడండి“ అన్నారు.

ఇక శ్రీధర్ మాట్లాడుతూ “నా సినిమా థియేటర్లో రిలీజ్ చేయడమే నాకు ఇష్టం అన్న నాని ఇప్పుడు నిర్మాతల ఇష్టం అంటున్నారు. థియేటర్స్ బాగుంటేనే నిర్మాతలు బాగుంటారు. ఇలాగే వుంటే ఓటీటీ వైపు వెళ్ళే నిర్మాతలకు తగిన సమాధానం చెపుతాము. హీరోయిజం అంటే థియేటర్ లోనే కనపడుతుంది, ఓటీటీలో కనపడదు“ అన్నారు. బాల గోవింద్ రాజ్ మాట్లాడుతూ “బాహుబలి లాంటి మూవీ ఓటీటీలో రిలీజ్ అయితే ఇంత పేరు వచ్చేదా..? ఓటీటీ టాలీవుడ్‌కి చాలా నష్టం. మేము నిర్మాతలకు అక్టోబర్ వరకు ఆగమని చెప్పాము. వాళ్లు ఓటీటీలో కాకుండా సినిమాల‌ను థియేటర్స్‌లోనే రిలీజ్ చెయ్యాలి“ అన్నారు. జెమిని కిరణ్ మాట్లాడుతూ.. ఓటీటీలో రిలీజ్ చేయడం తప్పు కాదు కానీ పండగల టైంలో చెయ్యవద్దు, ఈవిషయంలో నిర్మాతలకు లెటర్స్ కూడా రాసాము అందరితో మాట్లాడుతున్నాము అన్నారు. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bandla Ganesh: బండ్లేశ్వరా..! 48 ఏళ్ల వయస్సులో హీరోగా టర్న్.. ఆ హిట్ సినిమాకు రీమేక్.. సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్‌

Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌కు క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఢిల్లీ సుందరి..

Aakaasam Nee Haddhu Ra : సూర్య సినిమాకు అవార్డుల పంట.. మారో ఘనత సాధించిన ఆకాశం నీ హద్దురా..