Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aakaasam Nee Haddhu Ra : సూర్య సినిమాకు అవార్డుల పంట.. మారో ఘనత సాధించిన ఆకాశం నీ హద్దురా..

తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దు రా అనే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సూర్య సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు...

Aakaasam Nee Haddhu Ra : సూర్య సినిమాకు అవార్డుల పంట.. మారో ఘనత సాధించిన ఆకాశం నీ హద్దురా..
Suriya
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 20, 2021 | 4:38 PM

Aakaasam Nee Haddhu Ra : తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దు రా అనే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా సూర్య సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా సూర్యకు భారీ విజయాన్ని అందించింది. కరోనా కారణంగా థియేటర్స్‌లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ మూవీ సూపర్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్ గోపినాథ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సూర్య హిట్ రుచి చూసి చాలా కాలం అయ్యింది. వరుసగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నప్పటికీ అన్నీ నిరాశ పరిచాయి. ఈ క్రమంలో లేడీ డైరెక్టర్ సుధా కొంగరు దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమా తిరిగి సూర్యను సక్సెస్ ట్రాక్‌‌‌‌‌లోకి తీసుకువచ్చింది. ఈమూవీలో సూర్య సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్‌‌‌‌గా నటించింది. సిఖ్య ఎంటర్టైన్మెంట్స్ మరియు 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలై భారీ హిట్ అందుకున్న మొదటి సినిమాగా నిలిచింది.

తాజాగా ఈ సినిమా మారో ఘనత సాధించింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ ( IFFM ) 2021 లో రెండు క్యాటగిరీల్లో ఆకాశం నీ హద్దు రా సినిమా విజేతగా నిలిచింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్  2021 లో ఉత్తమ నటనకు గాను హీరో సూర్య గెలుపొందాడు. అలాగే ఉత్తమ చిత్రంగానూ ఈ సినిమా నిలిచింది. ఇలా రెండు అవార్డులను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో పరేష్ రావల్, ఊర్వశి, మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bangarraju Movie: సస్పెన్స్‏కు చెక్ పెట్టిన నాగ్.. ఎట్టకేలకు పట్టాలెక్కిన బంగార్రాజు..

Pushpa: అన్ని భాషల్లో అదరగొడుతున్న పుష్ప సాంగ్.. యూట్యూబ్ రికార్డ్స్ బద్దలుకొడుతున్న పాట..

Nani Shyam Singha Roy: నాని శ్యామ్‌ సింగరాయ్‌ ఓటీటీ వేదికగా విడుదలుతోందా..? చిత్ర యూనిట్‌ ఏమందంటే..