AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani Shyam Singha Roy: నాని శ్యామ్‌ సింగరాయ్‌ ఓటీటీ వేదికగా విడుదలుతోందా..? చిత్ర యూనిట్‌ ఏమందంటే..

Nani Shyam Singha Roy: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడడం ఓటీటీ సంస్థలు భారీ మొత్తానికి సినిమా హక్కులను కొనుగోలు చేస్తుండడంతో మేకర్స్‌ సినిమాలను నేరుగా ఓటీటీలో..

Nani Shyam Singha Roy: నాని శ్యామ్‌ సింగరాయ్‌ ఓటీటీ వేదికగా విడుదలుతోందా..? చిత్ర యూనిట్‌ ఏమందంటే..
Nani Shyam Singaraoy
Narender Vaitla
|

Updated on: Aug 20, 2021 | 2:31 PM

Share

Nani Shyam Singha Roy: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడడం ఓటీటీ సంస్థలు భారీ మొత్తానికి సినిమా హక్కులను కొనుగోలు చేస్తుండడంతో మేకర్స్‌ సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే బడా చిత్రాలు కొన్ని నేరుగా ఓటీటీలోనే విడులవుతున్నాయి. ఈ జాబితాలో వెంకటేష్‌ హీరోగా నటించిన నారప్ప, నితిన్ లీడ్‌ రోల్‌లో నటించిన మ్యాస్ట్రోతో, టక్‌ జగదీష్‌ పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో బడా సినిమా నేరుగా ఓటీటీ వేదికగా విడుదలకానుందని గతకొన్ని రోజులుగా ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్‌ సింగరాయ్‌ కూడా ఓటీటీలోనే విడుదలకానుందని వార్తలు వస్తున్నాయి.

ఓ బడా ఓటీటీ సంస్థ ఈ చిత్రాన్ని ఏకంగా రూ. 40 కోట్లు చెల్లించి మరీ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసిందని. భారీ డీల్‌ కావడంతో మేకర్స్‌ దీనికి ఓకే చెప్పారని వార్తలు వచ్చాయి. మరికొన్ని రోజుల్లోనే సినిమా విడుదల కానున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక నాని హీరోగా తెరకెక్కిన ‘టక్‌ జగదీష్‌’ కూడా ఓటీటీలో విడుదల అవుతుండడంతో ఈ వార్త కూడా నిజమేనని చాలా మంది భావించారు. అయితే ఈ ఓటీటీ పుకార్లపై ఎట్టకేలకు చిత్ర యూనిట్‌ స్పందించింది. శ్యామ్‌ సింగరాయ్‌ని ఎట్టి పరిస్థితుల్లో ఓటీటీలో విడుదల చేయట్లేదని, అవన్నీ పుకార్లేనని తేల్చిచెప్పారు. ఈ సినిమా విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే రాహుల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని సరన సాయిపల్లవి, కృతిశెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మిక్కి జె.మేయర్‌ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి.

Also Read: షేక్ అవుతున్న బాలీవుడ్.. హనీ ట్రాప్‌లో 100 మంది సెలబ్రిటీలు.. 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం

Tharagathi Gadi Daati Movie Review: ఆహాలో విడుదలైన తరగతి గది దాటి.. ఎలా ఉందంటే..

Vaishnav Tej: సూపర్ హిట్ నవల ‘కొండపొలం’ స్టోరీతో వైష్ణవ్ తేజ్, క్రిష్ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్‌లుక్