Tharagathi Gadi Daati Movie Review: ఆహాలో విడుదలైన తరగతి గది దాటి.. ఎలా ఉందంటే..

సాగర తీరంలోని ఓ నగరంలో గౌరీ శంకర్ ట్యూషన్స్ చెబుతూ ఉంటాడు. అతని దగ్గర దాదాపు 50 మంది స్టూడెంట్స్ ఉంటారు

Tharagathi Gadi Daati Movie Review: ఆహాలో విడుదలైన తరగతి గది దాటి.. ఎలా ఉందంటే..
Tharagathi Gadhi Daati
Follow us

|

Updated on: Aug 20, 2021 | 1:24 PM

నటీనటులు: హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ, నిఖిల్ దేవాదుల. దర్శకుడు: మల్లిక్ రామ్ నిర్మాత: కొల్లా ప్రవీణ్ సంగీత దర్శకుడు: నరేన్ ఆర్కే సిద్ధార్థ

కథ: సాగర తీరంలోని ఓ నగరంలో గౌరీ శంకర్ ట్యూషన్స్ చెబుతూ ఉంటాడు. అతని దగ్గర దాదాపు 50 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఆ ట్యూటోరియల్స్‏ను శంకర్, అతని భార్య రమణ భార్గవ్, బిందు చంద్రమౌళి నిర్వహిస్తుంటారు. అయితే వాళ్ల అబ్బాయి కృష్ణ అలియాస్ హర్షిత్ రెడ్డికి చెఫ్ కావాలని కోరిక ఉంటుంది. కానీ అతని తండ్రికి మాత్రం కృష్ణను ఇంజనీర్ చేయాలనుకుంటాడు. దీంతో తండ్రి దగ్గర చదువుకోవడం ఇష్టం ఉండదు కృష్ణకు. అయితే దుబాయ్ నుంచి వచ్చిన జాస్మిన్ (పాయల్ రాధాకృష్ణ) అనే అమ్మాయి అతని తండ్రి దగ్గరే జాయిన్ అవుతుంది. దీంతో కృష్ణకు కూడా అక్కడే చేరిపోతాడు. అయితే కృష్ణ స్నేహితుడు రవి.. అక్కడే చదుకునే బిందు (స్నేహల్)ని ఇష్టపడుతుంటాడు. తరగతి గది దాటి సినిమా మొత్తం కృష్ణ, జాస్మిన్, బిందు, రవి నలుగురు మధ్యే తిరుగుతుంటారు. జాస్మిన్ ప్రేమ కోసం కృష్ణ పడే తాపత్రాయపడడం… వీరి ప్రేమకు అడ్డుగా నిలిచే అర్జున్.. దీంతో వీరి మధ్య ఏర్పడిన అపార్థాలను ఆ టీనెజర్స్ ఎలా పరిష్కరించుకున్నారనేది కథ.

విశ్లేషణ.. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించేవిధంగా ప్లెజెంట్‏నెస్‏తో తెరకెక్కించారు. ఆడియన్స్‏ ఎక్కడా కూడా బోర్ కలిగే సన్నివేశాలు లేకుండా.. నేపథ్య సంగీతంతో ఆకట్టుకుంటూ సాగిపోతుంది. ప్రతి ఎపిసోడ్ ఇరవై, ఇరవై ఐదు నిమిషాలు మించి ఉండకుండా… ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని సరదగా చూసిన అనుభూతి కలుగుతుంది. ప్రస్తుతం స్నేహితులు, ప్రేమికుల మధ్య ఏర్పడే చిన్న చిన్న అపార్థాలు, ఇగో వలన దూరం పెరిగిపోవడం.. బాధపడడం సహజంగానే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సన్నివేశాల మాదిరిగానే కనిపిస్తాయి. అలాగే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే రిలేషన్ బాడింగ్ కూడా చూపించారు.

ఎవరు ఎలా చేసారంటే.. మెయిల్ సిరీస్‏లో నటించిన హర్షిత్ రెడ్డి.. ఇందులోనూ తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక నిఖిల్ దేవాదుల, పాయల్ రాధాకృష్ణ తమ తమ పాత్రలలో ఆకట్టుకున్నారు. ఇక కృష్ణ తల్లిదండ్రులుగా బిందు చంద్రమౌళి, రమణ భార్గవ్ సహజ నటన ప్రదర్శించారు. ఇతర పాత్రలలో వాసు ఇంటూరి, జయవాణి, సుజాత, స్వపిక నటించారు.

ఈ సినిమా ప్రజెంటెషన్ బాగుంది. అలాగే డైలాగ్స్ బాగున్నాయి. నేపథ్య సంగీతంతో ప్రేక్షకులను బోర్ కలగకుండా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొత్తానికి చాలా కాలం తర్వాత మనసుకు హత్తుకునే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు మరోసారి అందించింది తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.

సింగిల్ లైన్.. విసుగు రాని ఫీల్ గుడ్ లవ్ స్టోరీ

Also Read: Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. అందుకే  ఆ స్పెషల్ షూట్ చేస్తున్నారా ? 

Megastar Chiranjeevi: మెగాస్టార్ పుట్టినరోజున ఆచార్య మెగా అప్‏డేట్ రానుందా ?