AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: మెగాస్టార్ పుట్టినరోజున ఆచార్య మెగా అప్‏డేట్ రానుందా ?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఆచార్య. ఇందులో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్‏గా

Megastar Chiranjeevi: మెగాస్టార్ పుట్టినరోజున ఆచార్య మెగా అప్‏డేట్ రానుందా ?
Acharya
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 20, 2021 | 9:55 AM

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఆచార్య. ఇందులో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్‏గా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‏కు నెట్టింట్లో రికార్ట్స్ సృష్టించాయి. అయితే ఆగస్ట్ 22న మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి బిగ్ అప్‏డేట్ రానున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆరోజున ఆచార్య పోస్టర్‏తోపాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే… తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే పెద్ద సినిమాల నిర్మాతలు వినాయక చవితి, సంక్రాంతి పండుగల రోజున విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. అయితే మెగాస్టార్ అభిమానులు ఆచార్య అప్డేట్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ లెటేస్ట్ టాక్ ప్రకారం ఆచార్య సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రిలీజ్ అయ్యేట్లుగా తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ వాయిదా పడునున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. పొరపాటున ఆర్ఆర్ఆర్ వెనక్కి తగ్గితే.. ఆచార్యకు ఇంకా పోటీ ఉండదని చెప్పుకోవాలి.

ఇక ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా.. ఆగస్ట్ 21న చిరు బర్త్ డే మోషన్ పోస్టర్ రిలీజ్ కానుంది.

Also Read: Nootokka Jillala Andagadu: నూటొక్క జిల్లాల అందగాడు నుంచి మరోసాంగ్.. ఆకట్టుకుంటున్న అలసిన సంచారి వీడియో

Vivaha Bhojanambu: కడుపుబ్బ నవ్వేందుకు సిద్ధమవ్వండి అంటున్న వివాహ భోజనంబు టీం.. విడుదల ఎప్పుడంటే…

Childhood Photo: ఈ ఫొటోలో ఎవరో గుర్తుపట్టారా..చిరు మూవీకి వెళ్లి సైకిల్ పోగొట్టుకుని హీరోగా ఎదిగి చిరుతో సైకిల్ గిఫ్ట్‌గా అందుకున్న హీరో

Karthika Deepam: దీపను కొండెక్కేలా చేస్తాను అంటూ రోడ్డెక్కిన మోనిత!