AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Suhasini: సుహాసిని పుట్టినరోజు వేడుకల్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కమల్, ఖుష్భు తదితరులు..డ్యాన్స్ వీడియో వైరల్

Actor Suhasini: టాలీవుడ్ సీనియర్ నటి సుహాసిని.. అందం, అభినయంతో పాటు తన చిరునవ్వుతో ప్రేక్షకుల ఆకట్టుకున్నది. దక్షిణాదిలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో..

Actor Suhasini: సుహాసిని పుట్టినరోజు వేడుకల్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కమల్, ఖుష్భు తదితరులు..డ్యాన్స్ వీడియో వైరల్
Suhasini
Surya Kala
|

Updated on: Aug 20, 2021 | 10:09 AM

Share

Actor Suhasini: టాలీవుడ్ సీనియర్ నటి సుహాసిని.. అందం, అభినయంతో పాటు తన చిరునవ్వుతో ప్రేక్షకుల ఆకట్టుకున్నది. దక్షిణాదిలో తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి అశేష అభిమానులను సొంతం చేసుకుంది. సుహాసిని ఫేమస్ దర్శకుడు మణిరత్నాన్ని 1988 ఆగస్ట్‌ 25న పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నందన్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడు. ఇక సుహాసిని సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అమ్మ, అక్క, అత్త పాత్రల్లో నటిస్తూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా సుహాసిని మణిరత్నం ఆగస్ట్ 15న 60వ పుట్టిన రోజుని జరుపుకున్నది. ఈ పుట్టిన రోజు వేడుకల్లో సీనియర్ హీరోయిన్లతో పాటు సుహాసిని బాబాయ్ కమల్ హాసన్ తన ఫ్యామిలీతో హాజరయ్యారు. ఈ పార్టీలో వీరంతా ఓ రేంజ్ లో సందడి చేశారు.

సుహాసిని పుట్టినరోజు వేడుకలకు రమ్యకృష్ణ, ఖుష్బూ, సుమలత, అంబిక, మోహన్ తదితరులు హాజరయ్యారు. వీరంతా కలిసి పార్టీని ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశారు. సుహాసినితో క‌లిసి ర‌మ్య‌కృష్ణ‌, ఖుష్బూలు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Image పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను రమ్యకృష్ణ, ఖుష్బూ తమ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఎప్పుడూ వెలుగుతూ ఉండే సుహాసినితో ఎంతో విలువైన సమయాన్ని గడిపాను రమ్యకృష్ణ వీడియో కి కామెంట్ జత చేసింది. రమ్యకృష్ణ కామెంట్ కు సుహాసిని స్పందిస్తూ.. లవ్యూ రమ్య కుట్టి అని కామెంట్ చేసింది.

సుహాసిని పుట్టినరోజు వేడుకల్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కమల్, ఖుష్భు తదితరులు డ్యాన్స్ వీడియో వైరల్ ఖుష్బూ ఈ వీడియో షేర్ చేస్తూ.. మేము మా ప్రియమైన స్నేహితుడిని, మా బలగం అందరం కలిసి జరుపుకున్న వేడుక.. సుహాసిని పుట్టినరోజు. చిన్న కలయిక, అపరిమిత ప్రేమ, టన్నుల్లో నవ్వు. జ్ఞాపకాలు ఎప్పటికీ మరచిపోని జ్ఞాపకాలు అంటూ కామెంట్ జత చేసింది.

సినిమాల విషయానికి వస్తే.. సుహాసిని సుమంత్ తాజా సినిమామ‌ళ్లీ మొద‌లైందిలో నటిస్తుంది. ఇందులో వ్యాపార వేత్త‌గా క‌నిపించ‌నుంద‌ని టాక్. రమ్యకృష్ణ లైగర్, రిపబ్లిక్, రంగమార్తాండ లతో బిజీగా ఉంది. ఖుష్బూ శర్వానంద్ సినిమాలో నటిస్తుంది.

Also Read:  శ్రావణ శోభను సంతరించుకున్న తెలుగు రాష్ట్రాలు.. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్న మహిళలు