Varalakshmi Vratam: శ్రావణ శోభను సంతరించుకున్న తెలుగు రాష్ట్రాలు.. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్న మహిళలు

Varalakshmi Vratam: తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా భావించి మహిళలు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని..

Varalakshmi Vratam: శ్రావణ శోభను సంతరించుకున్న తెలుగు రాష్ట్రాలు.. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్న మహిళలు
Varalakshmi Vratam
Follow us
Surya Kala

|

Updated on: Aug 20, 2021 | 9:31 AM

Varalakshmi Vratam: తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా భావించి మహిళలు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నారు. దీంతో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. కరోనా నిబంధనలను అనుసరిస్తూ.. భక్తులను అమ్మరివారి దర్శనాన్ని చేసుకొనే అవకాశం ఆలయ సిబ్బంది కల్పిస్తున్నారు. ఆలయ పూజారులు అమ్మవారికీ ప్రత్యేక పూజలను చేపట్టారు. పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రత పూజలను నిర్వహిస్తున్నారు.

ఇక ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వరలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణమాసం, శుక్రవారంతో పాటు వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. మరోవైపు హైదరాబాద్ దిల్ షుక్ నగర్‌లోని అష్టలక్ష్మీ దేవాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు కరోనా నిబంధన నడుమ చేయనున్నారు. భక్తులకు అమ్మవారు వరలక్ష్మీ రూపంలో దర్శనమివ్వనున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో వరలక్ష్మి దేవి కొలువైంది. లక్ష్మీదేవి అమ్మవారిని కలశ రూపంలో ప్రతిష్టించి, మహిళలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తొమ్మిది రకాల పిండి వంటలతో పాటు పండ్లను నైవేధ్యంగా చెల్లిస్తారు. అమ్మవారికి చామంతులు, బంతి పువ్వులు వ్రతంలో సమర్పిస్తారు. ముత్తయిదువులను ఇంటికి పిలిచి వాయనాలు ఇస్తారు.

వరలక్ష్మి వ్రతం కథ..!

చారుమతి అనే పుణ్యవతి తల్లిదండ్రులను, అత్త మామలను సేవిస్తూ భర్త పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ వినయ విధేయతలతో ఉండేదట. చారుమతి కలలో ఒక రోజు వరలక్ష్మి అమ్మవారు కనిపించి నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము నన్ను పూజిస్తే అష్టైశ్వర్యాలు పొందుతావని చెప్పి అదృశ్యమైందట. అలా శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది చారుమతి. అలా అప్పటినుంచి ప్రతిఒకరు వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నారని పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విశిష్టమైంది.. అయితే శ్రావణ రెండో శుక్రవారం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

Also Read:   ఈ ఫొటోలో ఎవరో గుర్తుపట్టారా..చిరు మూవీకి వెళ్లి సైకిల్ పోగొట్టుకుని హీరోగా ఎదిగి చిరుతో సైకిల్ గిఫ్ట్‌గా అందుకున్న హీరో