Varalakshmi Vratam: శుక్రవారం లక్ష్మీదేవిని ఈ స్త్రోత్రంతో స్తుతిస్తే.. దారిద్య బాధల తీరి సుఖసంతోషాలతో ఉంటారట

 Varalakshmi Vratam: శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని ప్రాతఃకాలంలో, సాయంకాలంలో స్తోత్రంతో పారాయణం చేస్తే..విశేష ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం..  శుక్రవారం లక్ష్మీదేవిని..

Varalakshmi Vratam: శుక్రవారం లక్ష్మీదేవిని ఈ స్త్రోత్రంతో స్తుతిస్తే.. దారిద్య బాధల తీరి సుఖసంతోషాలతో ఉంటారట
Varalakshmi Vratam
Follow us

|

Updated on: Aug 20, 2021 | 10:27 AM

Varalakshmi Vratam: త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా లక్ష్మీదేవిని పూజిస్తారు. భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు లక్ష్మీదేవిని పూజిస్తే.. శ్రావణ మాసంలోని రెండో శుక్రవారం వరలక్ష్మి దేవిగా వ్రతాన్ని తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు ఆచరిస్తారు. లక్ష్మిదేవి చీర కట్టుకొని, అభరణాలను ధరించి చాలా అందంగా, ఆకర్షణీయంగా వుంటుంది. లక్ష్మిదేవి నాలుగు చేతులతో వుంటుంది. రెండు చేతులతో పుష్పాలను పట్టుకొని రెండు చేతులతో బంగారు నాణేలను అనుగ్రహిస్తూ వుంటుంది. తామర పువ్వు మీద కూర్చుని ఏనుగులతో భక్తులను అనుగ్రహిస్తుంది.శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్మి వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు ఆచరిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. అయితే శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని ప్రాతఃకాలంలో, సాయంకాలంలో స్తోత్రంతో పారాయణం చేస్తే..విశేష ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం..  శుక్రవారం లక్ష్మీదేవిని ఈ స్తోత్రం పారాయణం చేస్తే సంపద కలుగుతుందట..

నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 1 ‖

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి | సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 2 ‖

సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి | సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 3 ‖

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని | మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 4 ‖

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి | యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 5 ‖

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే | మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 6 ‖

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి | పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 7 ‖

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే | జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ‖ 8 ‖

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః | సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ‖

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం | ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ‖

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం | మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ‖

శ్రావణ శుక్రవారం విశేష ఫలితాలను ఇచ్చే ఈ శ్లోకాలు ప్రతి శుక్రవారం కూడా పఠిస్తే మంచిదట.. శుక్రవారం  ఈ శ్లోకాలను కనీసం 3 సార్లు పారాయణం చేస్తే తప్పక దారిద్య్ర బాధలు తొలగి.. సకల శుభాలు కలుగుతాయని పురాణాల కథనం

Also Read: శ్రావణ శోభను సంతరించుకున్న తెలుగు రాష్ట్రాలు.. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్న మహిళలు