AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షేక్ అవుతున్న బాలీవుడ్.. హనీ ట్రాప్‌లో 100 మంది సెలబ్రిటీలు.. 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం

Honey-Trapping Racket: బాలీవుడ్‌లో హనీట్రాప్ వ్యవహారం సంచలనంగా మారింది. సినిమా స్టార్లకే సినిమా చూపెట్టారు కిలాడీలు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 100 మందిని...

షేక్ అవుతున్న బాలీవుడ్.. హనీ ట్రాప్‌లో 100 మంది సెలబ్రిటీలు.. 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం
Bollywood Sextortion
Ram Naramaneni
|

Updated on: Aug 20, 2021 | 1:50 PM

Share

బాలీవుడ్‌లో హనీట్రాప్ వ్యవహారం సంచలనంగా మారింది. సినిమా స్టార్లకే సినిమా చూపెట్టారు కిలాడీలు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 100 మందిని ట్రాప్‌లో పడేశారు. న్యూడ్ విజువల్స్ రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగారు. సెలబ్రెటీల ఫిర్యాదులతో ముంబై సైబర్‌క్రైమ్‌కు మోతెక్కిపోతోంది. బాధితుల్లో టాప్ సెలబ్రిటీలతో పాటు మోడల్స్, రిచ్ వుమెన్, మెన్ ఉన్నారు. ఈ సెక్స్‌టార్షన్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది.

కొంటెగా, మాయగా ముంచేశారు….

సోషల్ మీడియాలో అదిరిపోయే హైఫ్రొఫైల్ పెడుతారు. డాక్టర్, లాయర్, బిజినెస్‌మెన్, ఉమెన్ అంటూ కలరింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతారు. నమ్మకంగా ఉంటారు. నమ్మిస్తారు. వీక్‌పాయింట్‌పై కొడుతారు. మెల్లిగా వీడియోకాల్స్, ఆ తర్వాత న్యూడ్ ఫోటోస్..న్యూడ్ విజవల్స్. కట్‌చేస్తే.. ఓ ఫైన్ మార్నింగ్ మీ ఫోన్‌ను చూసి మీరే భయపడుతారు. బాలీవుడ్‌ను షేక్‌ చేసి..ఓ ఆటాడించిన సెక్స్‌టార్షన్ గ్యాంగ్ కథ ఇది. ఒకరా ఇద్దరా వీరి ఏషాలను నమ్మి ఏకంగా వంద మంది సెలబ్రెటీలు ట్రాప్‌లో పడ్డారు.  ముంబయి సెక్స్‌టార్షన్ గ్యాంగ్ పేరు వినపడితేనే బాలీవుడ్ షేక్‌ అయిపోతోంది. బాధితులలో జాబితాలో టాప్ సెలబ్రిటీలతో పాటు మోడల్స్, రిచ్ వుమెన్ , మెన్ ఉన్నారు.  మొదట స్నాప్ చాట్ , ఇన్స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ షిప్ చేస్తారు. 6 నెలలు నమ్మకం కుదిరాక ట్రాప్ లోకి దింపుతారు. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడి.. రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్‌కు దిగుతారు. డబ్బులు డిమాండ్ చేస్తారు. మొత్తం ఊడ్చేస్తారు. అంతటితో ఆగదు వీరి అరాచకం. ఆ తర్వాత అదే వీడియోలను డార్క్‌వెబ్ వంటి ఫోర్న్ సైట్లకు అమ్ముతారు. ఇలా రెండు విధాలుగా డబ్బులు సంపాదిస్తారు. ఏకంగా ట్విట్టర్‌లో పెట్టేసి వీడియోలు అమ్మిన కేటుగాళ్లూ ఉన్నారు.

ముంబై సైబర్ సెల్‌కి సెలబ్రిటీల నుంచి ఫిర్యాదు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే నలుగురు నిందితుల అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా ఇంజనీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్స్. ఈజీ మనీ, జల్సాలకు అలవాటుపడీ ఇలా సెక్స్‌టార్షన్ గ్యాంగ్ అవతారమెత్తారు. తెలియని వారు. హైప్రొఫైల్ వ్యక్తుల పేరుతో వచ్చి ఫ్రెండ్‌ రిక్వెస్టులను ఎట్టిపరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయొద్దని హెచ్చరించారు పోలీసులు. తస్మాత్ జాగ్రత్త.

Also Read: పీర్ల పండగలో అపశృతి: అగ్నిగుండంలో పడ్డ వ్యక్తి.. అందరూ చూస్తుండగానే కాలిపోయాడు

విజయవాడ రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం పేరు.. అతడి నేరాలు, ఘోరాలు తెలిస్తే షాకే