AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virushka: లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతోన్న విరుష్క జంట.. రెస్టారెంట్‌లో సందడి చేసిన స్టార్ కపుల్. ఫొటోలు వైరల్‌.

Virushka In Restaurant: టీమిండియా ప్లేయర్‌లు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ఆ దేశంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో టెస్టు తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని...

Virushka: లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతోన్న విరుష్క జంట.. రెస్టారెంట్‌లో సందడి చేసిన స్టార్ కపుల్. ఫొటోలు వైరల్‌.
Anushka Virat
Narender Vaitla
|

Updated on: Aug 20, 2021 | 5:08 PM

Share

Virushka In Restaurant: టీమిండియా ప్లేయర్‌లు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా ఆ దేశంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో టెస్టు తర్వాత దొరికిన ఖాళీ సమయాన్ని ప్లేయర్స్‌ సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ టూర్‌కు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన సతీమణి అనుష్కను కూడా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టులో భారత్‌ అద్భుత విజయం సాధించిన విజయోత్సాహాంలో ఉన్న ఉన్న కోహ్లి భార్య అనుష్కతో లండన్‌ నగర విధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. ఇందులో భాగంగానే ఈ జంట తాజాగా లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు.

Virushka

ఆ రెస్టారెంట్‌లో ఈ జంట ఓ శాకాహార ఆహారాన్ని తీసుకున్నారు. ఈ విషయాన్ని అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాము తిన్న ఫుడ్‌కి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేసిన అనుష్క.. ‘నేను ఇప్పటి వరకు తిన్న బెస్ట్ వెజిటేరియన్‌ ఫుడ్‌’ ఇదేనంటూ కామెంట్‌ చేశారు. ఇక ఈ రెస్టారెంట్‌కు చెందిన చెఫ్‌ రిషిమ్‌ సచ్‌దేవా విరుష్క జంటతో దిగిన ఫొటోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ఈ జంట చూడముచ్చటగా కనిపిస్తోంది. దీంతో అటు అనుష్క అభిమానులు ఇటు విరాట్‌ ఫ్యాన్స్‌ తెగ ముచ్చట పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ దంపతులు ఇటీవల తాము పూర్తి శాకాహారులుగా ఉంటున్నామని తెలిపిన విషయం విధితమే. ఇక ఇండియా-ఇంగ్లాండ్‌ల మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ఆగస్టు 25న ప్రారంభంకానుంది.

Also Read: Afghanistan GDP: అభివృద్ధి దిశలో ఉన్న ఆఫ్ఘన్ ఆర్ధిక పరిస్థితిపై తాలిబన్ నీలి నీడలు..

క్లిక్.. క్లిక్.. ఫోటోగ్రాఫర్‌గా కొత్త అవతారమెత్తిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

Afghanistan Crisis: ఆప్ఘన్‌లో మళ్లీ కాలకేయుల రాజ్యం.. భారత్ మౌనం వెనుక కారణాలు

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ