AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan GDP: అభివృద్ధి దిశలో ఉన్న ఆఫ్ఘన్ ఆర్ధిక పరిస్థితిపై తాలిబన్ నీలి నీడలు..

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నియంత్రణలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తాలిబాన్ మొదటిసారి కంటే తక్కువ క్రూరంగా కనిపించడానికి ప్రయత్నిస్తోంది.

Afghanistan GDP: అభివృద్ధి దిశలో ఉన్న ఆఫ్ఘన్ ఆర్ధిక పరిస్థితిపై తాలిబన్ నీలి నీడలు..
Afghanistan Crisis
KVD Varma
|

Updated on: Aug 20, 2021 | 4:22 PM

Share

Afghanistan GDP:  ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నియంత్రణలోకి వచ్చింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తాలిబాన్ మొదటిసారి కంటే తక్కువ క్రూరంగా కనిపించడానికి ప్రయత్నిస్తోంది. వీటన్నింటి మధ్య, ప్రజల వలసలు కొనసాగుతున్నాయి. మహిళలు మళ్లీ ఇంటిలో బందీలు అవుతారని  భయపడుతున్నారు. దీంతో బాలికలు పాఠశాలలకు వెళ్లే అవకాశం కోల్పోతారని భయపడుతున్నారు. అదే సమయంలో, ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధి కోసం గత 20 ఏళ్లలో చేసిన ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాయి.

గత ఇరవై సంవత్సరాలలో ఆఫ్ఘనిస్తాన్ ఎంత మారిపోయింది? దాని జీడీపీ ఎంత పెరిగింది? సాధారణ ఆఫ్ఘనిస్తాన్ ఆదాయం ఎంత పెరిగింది? మిగిలిన దక్షిణాసియాతో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు పరిస్థితి ఎలా మారొచ్చు వంటి విషయాలను తెలుసుకుందాం ..

తాలిబాన్ సమయంలో అక్కడ GDP పరిస్థితి ప్రపంచ బ్యాంకుకు కూడా తెలియదు

1960 లో, ఆఫ్ఘనిస్తాన్ GDP 3.7 వేల కోట్లు. 1980 నాటికి, ఇది 26.7 వేల కోట్లకు చేరుకుంది, కానీ ఆ తర్వాత సోవియట్ యూనియన్, తరువాత తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ జీడీపీ రికార్డు ప్రపంచ బ్యాంకు వద్ద లేదు. ఆఫ్ఘనిస్తాన్ జీడీపీ 1980 తర్వాత 2002 లో మొదటిసారిగా విడుదల చేయబడింది. ఆ సమయంలో అది రూ .29.7 వేల కోట్లు. అంటే, 22 సంవత్సరాలలో జీడీపీ కేవలం 3 వేల కోట్లు మాత్రమే పెరిగింది. అయితే, గత 18 సంవత్సరాలలో ఆఫ్ఘనిస్తాన్ జీడీపీ రెట్టింపు అయింది. ఇప్పుడు మరోసారి తాలిబాన్ పాలన వచ్చిన తరువాత, ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది.

ఆఫ్గనిస్తాన్ జీడీపీ 1960లో 3.7 వేల కోట్లు పదేళ్లలో అంటే 1970 నాటికి అది 12.6 వేల కోట్లకు చేరుకుంది. తరువాత పదేళ్లకు 1980 లో ఆఫ్ఘన్ జీడీపీ 26.7 వేళా కోట్లుగా ఉంది. ఆ సమయంలో తాలిబన్ పాలన ప్రారంభం అయింది. అక్కడ నుంచి 2002 వరకూ ఆఫ్గనిస్తాన్ కు సంబంధించిన ఏ విషయమూ ప్రపంచంతో పంచుకోవడం జరగలేదు. దీంతో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా అక్కడ జీడీపీ ఎంత అనే వివరాలు ప్రపంచ బ్యాంకుకు కూడా తెలియలేదు. 2002లో అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మళ్ళీ జీడీపీ వివరాలు ప్రకటించారు. అప్పుడు జీడీపీ 29.7 వేల కోట్లుగా పేర్కొన్నారు. ఆ తరువాత 2010 నాటికి ఆఫ్ఘన్ జీడీపీ 118.1 వేళా కోతలకు చేరుకుంది. 2020 సంవత్సరంలో అంది 147.5 వేల కోట్లుగా రికార్డు అయింది. అంటే ఈ పద్దెనిమిది ఇళ్లలోనూ దాదాపు ఐదు రేట్లకు పైగా ఆఫ్ఘన్ జీడీపీ పెరిగింది.

ఇప్పుడు మరోసారి తాలిబన్ పాలన అక్కడ ప్రారంభం అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ దేశ ఆర్ధిక పరిస్థితి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. గతంతో పోల్చి చూస్తే..తాలిబన్లు కొంత ప్రపంచంతో సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నా.. ఎవరూ ప్రస్తుతం వారిని నమ్మే స్థితిలో లేరు. వాస్తవానికి తాలిబన్లు పాలన ప్రారంభం ఇంకా పూర్తిగా కాలేదు. కానీ, ఇప్పటికే అక్కడి పరిస్థితులు దిగజారిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ఆర్ధిక పరిస్థితులు ఎలా మారుతాయనేది చెప్పలేమని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

Also Read:

Afghanistan Crisis: ఆప్ఘన్‌లో మళ్లీ కాలకేయుల రాజ్యం.. భారత్ మౌనం వెనుక కారణాలు

Afghanistan Crisis: తాలిబన్లకు భారత్ దౌత్యపరమైన గుర్తింపు ఇస్తుందా? దౌత్యపరమైన గుర్తింపు..దాని ప్రాధాన్యత తెలుసుకోండి!

Afghanistan Crisis: ఆఫ్ఘన్ పరిణామాలపై భారత్ వ్యూహం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఏమంటోంది?