AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangarraju Movie: సస్పెన్స్‏కు చెక్ పెట్టిన నాగ్.. ఎట్టకేలకు పట్టాలెక్కిన బంగార్రాజు..

చాలా కాలంగా ఎదురుచూస్తున్న సస్పెన్స్‏కు చెక్ పెట్టేశాడు కింగ్ నాగార్జున. నాగ్ ప్రధాన పాత్రలో నటించిన సోగ్గాడే చిన్ని నాయన

Bangarraju Movie: సస్పెన్స్‏కు చెక్ పెట్టిన నాగ్.. ఎట్టకేలకు పట్టాలెక్కిన బంగార్రాజు..
Bangarraju
Rajitha Chanti
|

Updated on: Aug 20, 2021 | 3:06 PM

Share

చాలా కాలంగా ఎదురుచూస్తున్న సస్పెన్స్‏కు చెక్ పెట్టేశాడు కింగ్ నాగార్జున. నాగ్ ప్రధాన పాత్రలో నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి ప్రీక్వెల్‌‌‌గా బంగార్రాజు సినిమా చేయనున్నట్లుగా గతంలోనే ప్రకటించాడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. అయితే అనూహ్య కారణాలతో ఈ సినిమా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. దీంతో బంగార్రాజు మూవీ స్టార్ట్ అవుతుందా ? లేదా ? అనే సందేహాలు చాలా వరకు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఈ మూవీ షూటింగ్ ఈనెలలో ప్రారంభం కాబోతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడిచింది. ఇక ఇప్పటివరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన రూమర్స్‏కు స్వస్తీ పలికింది చిత్రయూనిట్. ఈరోజు (ఆగస్ట్ 20న) బంగార్రాజు మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

హైదరాబాద్‏లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన బంగార్రాజు సినిమా ముహుర్తపు కార్యక్రమానికి నాగచైతన్య, నాగార్జున, కృతి శెట్టి, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, నాగ సుశీల తదితరులు హాజరయ్యారు. ఇక ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే బంగార్రాజు కోసం ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ నేతృత్వంలో సెట్స్ నిర్మాణం కూడా పూర్తైనట్లుగా తెలుస్తోంది. ఇందులో నాగ్ సరసన రమ్యకృష్ణ నటించనుండగా.. చైతూకు జోడీగా కృతి శెట్టి హీరోయిన్‏గా నటించనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు బంగార్రాజు కోసం కూడా పనిచేయనున్నారు. ప్రస్తుతం నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో కాజల్ హీరోయిన్‏గా నటిస్తోంది.

ట్వీట్..

Also Read: KGF-2: సంచలనాల కేజీఎఫ్ 2.. సౌత్ శాటిలైట్ రేట్స్ ఎవరికి దక్కాయో తెలుసా ?

Tharagathi Gadi Daati Movie Review: ఆహాలో విడుదలైన తరగతి గది దాటి.. ఎలా ఉందంటే..

విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!