Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Seeti Maar : థియేటర్స్‌లోనే గోపీచంద్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన సీటీమార్ మూవీ మేకర్స్..

కరోనా కల్లోలం తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాలు ఊపందుకుంటున్నాయి. కరోనా కారణంగా చాలా సినిమాలు ఆగిపోయాయి..ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుతుండటంతో సినిమా ఇండస్ట్రీ ఉపిరిపీల్చుకుంటుంది...

Seeti Maar : థియేటర్స్‌లోనే గోపీచంద్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన సీటీమార్ మూవీ మేకర్స్..
Gopichand
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 20, 2021 | 3:23 PM

Seeti Maar : కరోనా కల్లోలం తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాలు ఊపందుకుంటున్నాయి. కరోనా కారణంగా చాలా సినిమాలు ఆగిపోయాయి..ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుతుండటంతో సినిమా ఇండస్ట్రీ ఉపిరిపీల్చుకుంటుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు రీలీజ్ డేట్స్ కోసం రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని సినిమాలు ఇప్పటికీ కూడా ఓటీటీ బాట పడుతుండటంతో థియేటర్స్ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్న సీటీమార్ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్ప్రార్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందింది. కబడ్డీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఆరేళ్ళ కిందటి ‘జిల్’ తర్వాత గోపీచంద్ కెరీర్‌లో సరైన బొమ్మే పడలేదు. ఆక్సిజన్ లాంటి ఎక్స్ పరిమెంట్లు, పంతంలాంటి కమర్షియల్స్ కూడా నడిచిన దాఖలా లేదు. అందుకే.. ఈసారి గౌతమ్ నందా ఫేమ్ సంపత్ నందితో సీటిమార్ మూవీకి సాలిడ్ ఎఫర్ట్ పెట్టారు. కబడ్డీ నేర్చుకుని మరీ పక్కా ప్రొఫెషనల్‌గా సెట్స్ లోకెళ్ళేవారు. బట్.. సీటిమార్‌కి రిలీజ్ యోగం ఎప్పుడన్నది సస్పెన్స్‌గా మారింది. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేయాలని అనుకున్నారు.

కానీ కోవిడ్ పరిస్థితుల కారణంగా పోస్ట్ పోన్ చేశారు. ఈ క్రమంలో గోపీచంద్ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందని తెగ ప్రచారం జరిగింది. ఈ విషయం పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించారు. రిలీజ్ డేట్‌ని త్వరలోనే అనౌన్స్ చేస్తామని తెలిపారు. ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక మణిశర్మ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకుని ఇప్పటికే రిలీజైన “జ్వాలా రెడ్డి”, “పెప్సీ ఆంటీ” సాంగులు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి.. సినిమాపై అంచనాలు పెంచేశాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bangarraju Movie: సస్పెన్స్‏కు చెక్ పెట్టిన నాగ్.. ఎట్టకేలకు పట్టాలెక్కిన బంగార్రాజు..

Pushpa: అన్ని భాషల్లో అదరగొడుతున్న పుష్ప సాంగ్.. యూట్యూబ్ రికార్డ్స్ బద్దలుకొడుతున్న పాట..

Nani Shyam Singha Roy: నాని శ్యామ్‌ సింగరాయ్‌ ఓటీటీ వేదికగా విడుదలుతోందా..? చిత్ర యూనిట్‌ ఏమందంటే..