AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Nani: మరోసారి జెర్సీ కాంబో రిపీట్ కానుందా.. నానితో సినిమా ప్లాన్ చేస్తున్న గౌతమ్ తిన్ననూరి

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిన సినిమా అంటే టక్కున చెప్పే పేరు జెర్సీ. ఈ సినిమా నటుడిగా నాని స్థాయిని పెంచింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని..

Actor Nani: మరోసారి జెర్సీ కాంబో రిపీట్ కానుందా.. నానితో సినిమా ప్లాన్ చేస్తున్న గౌతమ్ తిన్ననూరి
Nani
Rajeev Rayala
|

Updated on: Aug 20, 2021 | 4:02 PM

Share

Actor Nani: నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిన సినిమా అంటే టక్కున చెప్పే పేరు జెర్సీ. ఈ సినిమా నటుడిగా నాని స్థాయిని పెంచింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్నినేచురల్ స్టార్ నాని కెరీర్‌లో మైల్ స్టోన్‌గా నిలిచిన సినిమా అంటే టక్కున చెప్పే పేరు జెర్సీ. ఈ సినిమా నటుడిగా నాని స్థాయిని పెంచింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేక్షకుల మనసు తాకింది. జెర్సీ సినిమాలో ఎమోషన్స్ సినిమా విజయానికి కీలకమని చెప్పాలి. గౌతమ్ తిన్ననూరి ఇప్పుడు జెర్సీ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా చేయాలని చూశాడు. ఈలోగా చరణ్-శంకర్ సినిమాకు కమిట్ అయ్యారు. దాంతో ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి మరోసారి నానితో కలిసి నటించడానికి సిద్ధం అయ్యాడని తెలుస్తుంది.

అయితే చరణ్‌తో సినిమా ఎలాగైనా తీస్తానని గౌతమ్ తిన్ననూరి చెప్తున్నారు. రామ్ చరణ్ -శంకర్ సినిమా పూర్తయిన తర్వాత తన సినిమా మొదలు పెట్టనున్నాడట. ఇంతలో నానితో కలిసి మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్ వినిపిస్తుంది. మరో సారి అద్భుతమైన కథను నాని కోసం ప్లాన్ చేస్తున్నాడట గౌతమ్. జెర్సీ లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న ఈ కాంబో పై భారీ అంచనాలే ఉంటాయి. ఇక నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. అలాగే శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలు థియేటర్ రిలీజ్ అవ్వబోతున్నాయి. వీటిలో శ్యామ్ సింగరాయ్ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bangarraju Movie: సస్పెన్స్‏కు చెక్ పెట్టిన నాగ్.. ఎట్టకేలకు పట్టాలెక్కిన బంగార్రాజు..

Pushpa: అన్ని భాషల్లో అదరగొడుతున్న పుష్ప సాంగ్.. యూట్యూబ్ రికార్డ్స్ బద్దలుకొడుతున్న పాట..

Nani Shyam Singha Roy: నాని శ్యామ్‌ సింగరాయ్‌ ఓటీటీ వేదికగా విడుదలుతోందా..? చిత్ర యూనిట్‌ ఏమందంటే..

మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!
కొత్త ఆదాయపు పన్ను చట్టం రూల్స్‌ డ్రాప్ట్‌ రిలీజ్‌!
కొత్త ఆదాయపు పన్ను చట్టం రూల్స్‌ డ్రాప్ట్‌ రిలీజ్‌!