Pushpa: అన్ని భాషల్లో అదరగొడుతున్న పుష్ప సాంగ్.. యూట్యూబ్ రికార్డ్స్ బద్దలుకొడుతున్న పాట..

టాలీవుడ్‌లో విడుదలకబోతున్న భారీ సినిమాల్లో పుష్ప సినిమా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

Pushpa: అన్ని భాషల్లో అదరగొడుతున్న పుష్ప సాంగ్.. యూట్యూబ్ రికార్డ్స్ బద్దలుకొడుతున్న పాట..
Pushpa
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 20, 2021 | 2:50 PM

Pushpa: టాలీవుడ్‌లో విడుదలకాబోతున్న భారీ సినిమాల్లో పుష్ప సినిమా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. అలాగే పుష్ప మూవీలో బన్నీ స్మగ్లర్‌‌‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించని ఊర మాస్‌‌లుక్‌లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో బన్నీ ముగ్గురు విలన్‌‌‌లతో పోటీపడనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక విలన్‌‌‌‌గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్‌‌‌‌ను ఫిక్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పుష్పరాజ్ వీడియో విపరీతమైన రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన పుష్ప టైటిల్ సాంగ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ పాటను ఐదు భాషల్లో విడుదల చేశారు. అన్ని భాషల్లో ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగులో అత్యధిక వ్యూస్‌‌‌‌‌‌ను అతి తక్కువ సమయంలో దక్కించుకోవడంతో పాటు అత్యధిక లైక్స్‌ను తక్కువ సమయంలో దక్కించుకున్న పాటగా రికార్డ్స్ క్రియేట్ చేసింది.

ఇక ఈ పాట కేవలం తెలుగులోనే కాదు విడుదలైన అన్ని భాషల్లో రికార్డ్స్‌‌ను క్రియెట్ చేస్తుంది. అన్ని భాషల్లో కూడా లక్షకు పైగా లైక్స్‌ను దక్కించుకున్న ఏకైక పాటగా పుష్ప సాంగ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్‌ను దక్కించుకుంటున్న పుష్ప సినిమా కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డ్‌లు బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్నా నటించిన విషయం తెల్సిందే. ఇక కీలక పాత్రలో అనసూయ నటించింది. అలాగే సునీల్ నెగిటివ్ షేడ్స్ ఉన్నపాత్రలో కనిపించనున్నారు. పుష్ప రెండు పార్ట్ లుగా రూపొందుతోంది. మొదటి పార్ట్ కు సంబంధించిన షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. వచ్చే క్రిస్మస్‌కు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nani Shyam Singha Roy: నాని శ్యామ్‌ సింగరాయ్‌ ఓటీటీ వేదికగా విడుదలుతోందా..? చిత్ర యూనిట్‌ ఏమందంటే..

Tharagathi Gadi Daati Movie Review: ఆహాలో విడుదలైన తరగతి గది దాటి.. ఎలా ఉందంటే..

Radhe Shyam: రాధేశ్యామ్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. అందుకే  ఆ స్పెషల్ షూట్ చేస్తున్నారా ? 

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!