Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌కు క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఢిల్లీ సుందరి..

అందాల రకుల్ ప్రీత్ సింగ్‌కు అవకాశాలు తగ్గాయా అంటే.. అవుననే టాక్ వినిపిస్తుంది. సంధీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అనే సినిమాతో మంచి హిట్ అందుకుంది.

Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌కు క్రేజీ ఆఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఢిల్లీ సుందరి..
Rakul
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 20, 2021 | 6:25 PM

Rakul Preet Singh: అందాల రకుల్ ప్రీత్ సింగ్‌కు అవకాశాలు తగ్గాయా అంటే.. అవుననే టాక్ వినిపిస్తుంది. సంధీప్ కిషన్ నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అనే సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ చిన్నది. దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించింది రకుల్. ఇక తెలుగులోనే కాకుండా.. తమిళ్‌లోనూ ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకోవడానికి ప్రయత్నించింది. అలాగే బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ పలు సినిమాల్లో చేసింది ఈ పుత్తడి బొమ్మ. అయితే ఈ మధ్య కాలంలో రకుల్ జోరు తగ్గిందనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. నిన్నమొన్నటివరకు స్టార్ హీరోలకు ఈ అమ్మడే మొదటి ఛాయిస్‌గా ఉండేది. కానీ ఇప్పుడు కొత్త అందాలు ఎంట్రీ ఇవ్వడంతో రకుల్ లాంటి సీనియర్ బ్యూటీ ఆఫర్లు తగ్గాయన్నది ఇన్సైడ్ టాక్.

ప్రస్తుతం రకుల్ విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 సినిమాలో కీలక పాత్ర చేస్తుంది. ఆలాగే తెలుగులో వైష్ణవ్ తేజ్ నటించిన కొండపోలం సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ పల్లెటూరి యువతిగా కనిపించనుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడికి అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. అయితే ఆ ఆఫర్ వచ్చింది తెలుగులో కాదు..అలాఅని తమిళ్‌లోనూ కాదు.. బాలీవుడ్‌లో. తెలుగు-తమిళ్ భాషల్లో సూపర్ హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ రాక్షసుడు సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాను హిందీలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ రీమేక్ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్‌ను అనుకుంటున్నారట. ఈ సినిమాలో రకుల్ పాత్రకు కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కనుక నటిగా నిరూపించుకునేందుకు ఈ అమ్మడికి అవకాశం ఉంది. మరి రకుల్ రాక్షసుడితోనైనా అక్కడ రాణిస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aakaasam Nee Haddhu Ra : సూర్య సినిమాకు అవార్డుల పంట.. మారో ఘనత సాధించిన ఆకాశం నీ హద్దురా..

Virushka: లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతోన్న విరుష్క జంట.. రెస్టారెంట్‌లో సందడి చేసిన స్టార్ కపుల్. ఫొటోలు వైరల్‌.

Actor Nani: మరోసారి జెర్సీ కాంబో రిపీట్ కానుందా.. నానితో సినిమా ప్లాన్ చేస్తున్న గౌతమ్ తిన్ననూరి

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!