Meenakshi Chaudhary : ఆ హీరో అంటే పిచ్చి క్రష్.. అలాంటి భర్త కావాలి.. మీనాక్షి చౌదరి మనసు పడ్డ స్టార్ ఎవరంటే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. కొన్ని నెలలుగా వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సైలెంట్ అయ్యింది. హిట్ 2, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తుంది.

తెలుగు సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. కానీ కొన్ని రోజులుగా ఈ బ్యూటీ సైలెంట్ అయ్యింది. హిట్ 2, లక్కీ భాస్కర్ సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు.. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ మూవీలో వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్లుగా నటించగా.. భార్య భాగ్యం పాత్రలో ఐశ్వర్య, ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపించారు. ఇక ఈ సినిమాలో తన లుక్స్, నటనతో కట్టిపడేసింది మీనాక్షి. ఈ సినిమా తర్వాత మీనాక్షికి తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో బిజీగా ఉంది.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..
ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇండస్ట్రీలో తన క్రష్ ఎవరో రివీల్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. తనకు కాబోయేవాడికి ఉండాల్సిన క్యాలిటీస్ సైతం బయటపెట్టింది. తనకు కాబోయే వాడి గురించి 100 విషయాలు మైండ్ లో ఉన్నాయని.. అందులో ముఖ్యంగా అతడు పొడుగ్గా ఉండాలని.. మంచి మనిషి అయి ఉండాలని తెలిపింది. అలాగే తెలివైనవాడు కూడా అయి ఉండాలని చెప్పుకొచ్చింది. తాను కాస్త హైట్ ఎక్కువ అని.. హీల్స్ వేసుకున్నప్పటికీ తన హైట్ కు మ్యాచ్ చేయాలని.. తనలాంటి మేల్ వెర్షన్ కావాలని.. అలాంటి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
ఇక ఇండస్ట్రీలో తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమని.. ఇప్పటివరకు తెలుగులో ఆయన తన క్రష్ అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ చాలా అందంగా, పొడుగ్గా ఉంటారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మీనాక్షి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. అటు మారుతి డైరెక్షన్లో రాజాసాబ్, హను దర్శకత్వంలో ఫౌజీ చిత్రంలో నటిస్తున్నారు.

Meenakshi Chaudhary, Prabha
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..




