Manchu Vishnu: టాలీవుడ్‌లోనూ జస్టిస్ హేమ కమిటీ ప్రకంపనలు.. సీఎం రేవంత్‌కు మంచు విష్ణు ప్రత్యేక విజ్ఞప్తి

జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా అద్భుతమై కళాత్మకమైన సినిమాలు తీస్తారన్న మలయాళ సినిమా ఇండస్ట్రీ ఈ నివేదికతో భారీ కుదుపునకు లోనైంది. సినిమా ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, హింస గురించి ఒక్కొక్కరూ ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దీంతో ఇతర ఇండస్ట్రీల్లోనూ జస్టిస్ హేమ కమిటీ తరహా విచారణ జరగాలని నటీమణులు కోరుతున్నారు

Manchu Vishnu: టాలీవుడ్‌లోనూ జస్టిస్ హేమ కమిటీ ప్రకంపనలు.. సీఎం రేవంత్‌కు మంచు విష్ణు ప్రత్యేక విజ్ఞప్తి
Cm Revanth Reddy, Manchu Vishnu
Follow us
Basha Shek

|

Updated on: Sep 05, 2024 | 8:33 PM

జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా అద్భుతమై కళాత్మకమైన సినిమాలు తీస్తారన్న మలయాళ సినిమా ఇండస్ట్రీ ఈ నివేదికతో భారీ కుదుపునకు లోనైంది. సినిమా ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, హింస గురించి ఒక్కొక్కరూ ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. దీంతో ఇతర ఇండస్ట్రీల్లోనూ జస్టిస్ హేమ కమిటీ తరహా విచారణ జరగాలని నటీమణులు కోరుతున్నారు. టాలీవుడ్ లోనూ ఇలాంటి కమిటీని ఏర్పాటు చేయాలని సమంతతో పాటు పలువురు నాయికలు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే మా అధ్యక్షులు మంచు విష్ణు తెలంగాణ ప్రభుత్వానికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళల భద్రత, రక్షణను మరింత మెరుగుపరచడం కోసం వారి తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు మంచు విష్ణు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

‘మా’ అధ్యక్షుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీశాఖ మంత్రులకు నాదొక ప్రత్యేక విజ్ఞప్తి. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలకు రక్షణ, భద్రత మరింత మెరుగుపడేలా వారి తరపున ప్రాతినిధ్యం వహించేందుకు ఓ కమిషన్‌ ఏర్పాటు చేయండి. కెమెరా ముందు వెనుక ప్రతి ఒక్కరికీ భద్రతతో కూడిన పరిస్థితులు ఉండాలన్న దానికి మేం చాలా ప్రాధాన్యం ఇస్తున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ‘మా’ ఎప్పుడూ కట్టుబడి ఉంది. మహిళ భద్రత, సాధికారితకు ప్రతిరూపంలా నిలిపేందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నాం’ అని ఎక్స్ లో రాసుకొచ్చారు మంచు విష్ణు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మరి టాలీవుడ్ ఇండస్ట్రీలోని మహిళల భద్రతపై మంచు విష్ణు చేసిన విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మంచు విష్ణు ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.