AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Committee Kurrollu OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘కమిటీ కుర్రోళ్లు’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ కానుందంటే..

యూట్యూబ్ లో చాలా పాపులర్ అయినవారిని తీసుకుని.. మరికొందరు కొత్తవాళ్లను మెయిన్ లీడ్స్ గా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆగస్ట్ 9న చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.17 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

Committee Kurrollu OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'కమిటీ కుర్రోళ్లు'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ కానుందంటే..
Committee Kurrollu
Rajitha Chanti
|

Updated on: Sep 05, 2024 | 8:37 PM

Share

ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఘన విజయం సాధించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించిన నటీనటులు అందరూ కొత్తవాళ్లు కావడం విశేషం. యూట్యూబ్ లో చాలా పాపులర్ అయినవారిని తీసుకుని.. మరికొందరు కొత్తవాళ్లను మెయిన్ లీడ్స్ గా తీసుకుని తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆగస్ట్ 9న చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.17 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాతో మొత్తం 15 మంది కొత్త నటీనటులు వెండితెరకు పరిచయమయ్యారు. 90’s కిడ్స్ చదువు, ప్రేమలు, ఊళ్లో వారి జీవితం, స్నేహం, రిజర్వేషన్లు, ఊళ్లో జరిగే జాతరలు ఇలా అన్ని అంశాలు కలగలిపి ఈ ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించారు నూతన దర్శకుడు యదు వంశీ.

ఇవి కూడా చదవండి

కథ విషయానికి వస్తే..

గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరు పురుషోత్తంపల్లి. అక్కడ పన్నెండేళ్లకు ఒకసారి జరిగి భరింకాళమ్మ తల్లి జాతరకు ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. అయితే జాతర జరిగిన పదిరోజులకే సర్పంచ్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంటుంది. అయితే సర్పంచ్ బరిలో నిలబడే ఇద్దరి వ్యక్తులకు మధ్య గొడవలు ఉంటాయి. ఈ క్రమంలోనే జాతర పూర్తయ్యే వరకు ఊర్లో ఎన్నికల ప్రచారం జరగకూడదని తీర్పునిస్తారు. కానీ ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్