Kantara: Chapter 1: కాంతార ప్రీక్వెల్‌లో స్టార్ హీరో.. రిషబ్ శెట్టికి తండ్రిగా సీనియర్ నటుడు
కాంతారకు ప్రీక్వెల్ గా 'కాంతార చాప్టర్ 1' సినిమా రానుంది. రిషబ్ శెట్టి ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. సినిమా కథ మొత్తం కదంబ యుగంలో సాగుతుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు కాంతార సినిమాలో ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని తెలుస్తోంది. కాంతార సినిమా ముందుగా కన్నడలో విడుదలై ఆతర్వాత ఇతర భాషల్లో విడుదలైంది.
రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగులోనూ కాంతార సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కాంతారకు ప్రీక్వెల్ గా ‘కాంతార చాప్టర్ 1’ సినిమా రానుంది. రిషబ్ శెట్టి ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. సినిమా కథ మొత్తం కదంబ యుగంలో సాగుతుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు కాంతార సినిమాలో ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని తెలుస్తోంది. కాంతార సినిమా ముందుగా కన్నడలో విడుదలై ఆతర్వాత ఇతర భాషల్లో విడుదలైంది. కాగా ఇప్పుడు కాంతార చాప్టర్ 1ను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు.
ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
ఇదిలా ఉంటే ఇప్పుడు మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ కాంతార: చాప్టర్ 1లో నటించనున్నారని తెలుస్తోంది. రిషబ్‌కి తండ్రి పాత్రలో మోహన్‌లాల్ నటించనున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘కాంతార: చాప్టర్ 1’ ఇండియాలో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటి. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మోహన్‌లాల్ కూడా నటిస్తున్నారాని సమాచారం. రిషబ్ ఏప్రిల్‌లో మోహన్‌లాల్‌ను కలిశాడు. కాగా ఇప్పుడు కాంతార టీమ్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే
‘కాంతార సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ కుందాపూర్‌లో జరుగుతోంది. 2025లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. సినిమా విడుదల తేదీపై అధికారిక సమాచారం లేదు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ పూర్తయిందని తెలుస్తోంది. ఈ సినిమా OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఇక మోహన్ లాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బరోజ్’. ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.
ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.