Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దేవర సినిమా చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. ఇక దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు కొరటాల.

Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
Devara
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 01, 2024 | 2:39 PM

ఎక్కడ చూసిన దేవర సినిమా మేనియానే కనిపిస్తుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దేవర సినిమా చూసిన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో ఫ్యాన్స్ తెగ హంగామా చేస్తున్నారు. ఇక దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు కొరటాల. మొదటి భాగం చివరిలో చాలా ట్విస్ట్ లు చూపించారు. దాంతో రెండో పార్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాంతో ఇప్పుడు దేవర 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు తారక్ ఫ్యాన్స్.

ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు

అలాగే దేవర సినిమా కలెక్షన్స్ పరంగాను దుమ్మురేపుతోంది. ఇప్పటికే రూ. 300కోట్లు దాటేసింది ఈ సినిమా. ఇక రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ సొంతం చేసుకుంటుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కాగా దేవర సినిమాలో చాలా మంది నటించారు. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్, అలాగే శ్రుతి మరాఠా నటించగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా చేసి అదరగొట్టాడు. వీరితో పాటు అజయ్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.

ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే

అలాగే పై ఫొటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా.? దేవర సినిమాలో నటించి ఆకట్టుకుంది. కనిపించేది కొంత సేపే అయినా తన అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. బైరా గా నటించిన సైఫ్ కొడుకుతో దేవర సినిమాలో కనిపిస్తుంది ఈమె. అయితే ఆమె అందానికి ఫిదా అయిన ప్రేక్షకులు ఆమె. ఎవరు అంటూ గూగుల్ లో సోషల్ మీడియాలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె పేరు లతా రెడ్డి. సోషల్ మీడియాలో రీల్స్ తో ఆకట్టుకుంది ఆ అమ్మడు. లతా రెడ్డి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో పాటూ మరికొన్ని సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసి ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తన అందంతో కుర్రాళ్లను కిర్రెక్కిస్తుంది. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న లతా రెడ్డి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

లతా రెడ్డి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి