బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే

యాక్షన్ హీరో విశాల్ నటించిన భరణి సినిమా గుర్తుందా.? తమిళ్ తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే
Vishal Bharani Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 30, 2024 | 1:13 PM

చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే కనిపించకుండా మాయం అయిపోతూ ఉంటారు. అరెరే ఈ హీరోయిన్ చాలా బాగుందే అనుకునేలోగా ఆమె సినిమాల నుంచి మాయం అవుతుంది. మళ్ళీ కనిపించదు.. కొంతకాలానికి ప్రేక్షకులు కూడా ఆమెను మర్చిపోతారు. ఆతర్వాత ఎప్పటికో ఓ సినిమా ఫ్యాక్షన్ లోనో.. లేదా ఏదైనా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లోనో కనిపించి షాక్ ఇస్తారు. ఇక కొంతమంది హీరోయిన్స్ కోసం నెటిజన్స్ సోషల్ మీడియాను గాలిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ ఒకరు. యాక్షన్ హీరో విశాల్ నటించిన భరణి సినిమా గుర్తుందా.? తమిళ్ తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి : Tollywood : కేంద్రమంత్రి గారి భార్య ఫేమస్ టాలీవుడ్ హీరోయిన్ .. ఆమె ఎవరో తెలుసా..?

భరణి సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ గుర్తుందా..? బబ్లీ లుక్స్ తో, ఆకట్టుకునే స్మైల్ తో కవ్వించింది ఈ వయ్యారి భామ. ఆ బ్యూటీ పేరు ముక్త. అందాల భామ ముక్త మలయాళం, తమిళ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కుర్రాళ్ళ మనసులో బాణాలు గుచ్చింది. ముక్త ఓట్ట ననయం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆతర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందుకుంది. ముక్త తెలుగులో నటించిన ఒకే ఒక్క సినిమా ఫోటో. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత కొన్ని తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది.

ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్

ముక్త పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఇక ఇప్పుడు ముక్త ఎలా ఉంది.? అని కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాను  తెగ గాలిస్తున్నారు. ఈ క్రమంలో ముక్త లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముక్త కూతురు కూడా సినిమాల్లో నటించింది. ఇక ఇన్నాళ్ల తర్వాత ముక్త తిరిగి సినిమాల్లో బిజీ కానుంది. కురువై పాప అనే సినిమాతో ముక్త రీఎంట్రీ ఇచ్చింది. ముక్త 2015లో సింగర్‌ రిమి టోనీ సోదరుడు రింకు టోమీని పెళ్లాడింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ఈమె, ఆమె ఒక్కటేనా..? ఎవరో తెలిస్తే బిత్తరపోవాల్సిందే

View this post on Instagram

A post shared by Muktha (@actressmuktha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.