NTR : ఎన్టీఆర్‌కు జోడీగా క్రేజీ బ్యూటీ.. ప్రశాంత్ నీల్ సినిమాలో ఈ అందాల భామ
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దేవర సినిమాను కొరటాల రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక దేవత సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవర మూడు రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత పాన్ వరల్డ్ యాక్టర్ అయ్యాడు. ఇటీవలే ఆయన నటించిన ‘దేవర’ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దేవర సినిమాను కొరటాల రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక దేవత సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవర మూడు రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ‘దేవర’ సినిమా విడుదల కావడంతో జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాపై చర్చ మొదలైంది. ఎన్టీఆర్ లైనప్ చేసిన సినిమాల్లో ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి.
ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు
ఎన్టీఆర్ తొలి హిందీ సినిమా ‘వార్ 2’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. వార్ 2లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. ఇప్పుడు తన కొత్త సినిమా షూటింగ్‌కి రెడీ అవుతున్నాడు తారక్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ నటిస్తున్నాడు. కొన్ని వారాల క్రితమే ముహూర్తాన్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.
ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే
రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్త సముద్రాలూ దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుక్మిణి వసంత్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాలో నటించేందుకు బాలీవుడ్ టాప్ నటీమణులు వరుస కడుతుండగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం కన్నడ నటికి ఈ పెద్ద అవకాశం ఇచ్చాడు. సినిమాలో ఆమె పాత్ర డీ-గ్లామరస్‌గా ఉంటుందని అంటున్నారు. ఇది కాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు షేడ్స్ లో నటిస్తాడని, రుక్మిణి వసంత్ కూడా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఇక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
Instagram पर यह पोस्ट देखें
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.