చెప్పులు విప్పి సినిమా చూస్తున్న ప్రేక్షకులు.. హిస్టరీలోనే మొదటిసారి అంటున్న నెటిజన్స్
అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన మహావతార్ నరసింహ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమాకు ప్రస్తుతం IMDBna 9.8 రేటింగ్ కలిగి ఉంది. ఇప్పటివరకు భారతీయ సినిమాల్లో అరుదైన విజయాన్ని సాధించింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషలలో 2డీ, త్రీడీ వెర్షన్స్ లో రిలీజ్ చేశారు.
ప్రతివారం థియేటర్స్ లో కొత్త కొత్త సినిమాల విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వరుసగా సినిమాలు పాన్ ఇండియారేంజ్ లో విడుదలవుతున్నాయి. నాలుగు నుంచి ఐదు భాషల్లో సినిమాలు విడుదలవుతున్నాయి. ఇక ఈ వారం కూడా కొత్త సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అయితే ఓ థియేటర్ ముందు కుప్పలు కుప్పలుగా చెప్పులు కనిపించాయి. సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులందరూ థియేటర్ ముందు చెప్పులు విడిచి సినిమా చూస్తున్నారు. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఇటీవలే విడుదలైన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ. క్లీమ్ ప్రొడక్షన్స్, హోంబలే ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి. ఈ సినిమా ఈ నెల 25న విడుదలైంది.
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నరసింహ థియేటర్స్ లో దూసుకుపోతుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి ప్రేక్షకుల ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన మహావతార్ నరసింహ సినిమా గురించే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మొత్తం మహావతార్ నరసింహ సినిమా వీడియోలే కనిపిస్తున్నాయి. తాజాగా మహావతార్ నరసింహ సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
ఈ వీడియోలో ప్రేక్షకులు మహావతార్ నరసింహ సినిమా చూడటానికి థియేటర్ బయట చెప్పులు విడిచి సినిమా చూశారు. గుడికి వెళ్లినట్టు ప్రేక్షకులు ఈ సినిమాకు వెళ్తున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈవీడియోనే కాదు మహావతార్ నరసింహ థియేటర్ లో ప్రేక్షకులు భజనలు చేస్తున్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా మహా విష్ణువు దశావతారాల ఆధారంగా పదేళ్లపాటు వరుసగా సినిమాలు రూపొందనున్నాయి. ‘మహావతార్’ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మేకర్స్ ఏడాదికి ఓ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక మహావతార్ సినిమా కలెక్షన్స్ పరంగాను రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు రూ.20 కోట్లకు పైగా వసూల్ చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








