చంద్రముఖి పాత్ర వదులుకుంది.. స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన బ్యూటీ.. సినిమాలకు గుడ్ బై చెప్పి..
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో చంద్రముఖి ఒకటి. రజినీకాంత్ నటించిన ఏకైక హారర్ మూవీ ఇది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ తోపాటు ఈ మూవీలో జ్యోతిక తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ఏకైన హారర్ మూవీ చంద్రముఖి. పి వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఘాన విజయం సాధించింది. రజినీకాంత్ నటన, ఆయన స్టైల్ ఈ మూవీలో ఆకట్టుకున్నాయి. అలాగే సినిమాలో జోతిక నటన ప్రేక్షకులకు వణుకు పుట్టించింది. చంద్రముఖిగా ఆమె నటన, అభినయం సినిమా చూస్తున్న వారిని కట్టిపడేసింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే కదలకుండా చూసే వారు ఉన్నారు. అంతలా ప్రేక్షకులను అలరించింది చంద్రముఖి. ఈ సినిమాలో నయన తార కూడా నటించింది. 2005లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. విద్య సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
ఇదిలా ఉంటే చంద్రముఖి గా నటించిన జోతిక పాత్రలో ముందుగా మరో హీరోయిన్ ను అనుకున్నారట దర్శకుడు వాసు. ఈ సినిమాలో జోతిక పాత్రకు ముందు హీరోయిన్ సదాను అనుకున్నారట. ఈ మేరకు ఆమెను సంప్రదించగా ఆమె ఇతర సినిమాలతో బిజీ కావడంతో ఆమె ఆ పాత్రను మిస్ చేసుకున్నారట. అదే సంవత్సరం శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమాలో నటించింది సదా. ఆ సినిమా ఘన విజయం సాధించింది.
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
ప్రస్తుతం సదా సినిమాలు తగ్గించింది. మంచి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం పలు టీవీ షోలకుజడ్జ్ గా వయవహరిస్తున్నారు సదా. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ గా మారి జంతువుల ఫొటోలతో ఆకట్టుకుంటుంది. పి వాసు దర్శకత్వంలోనే చంద్రముఖి 2 కూడా తెరకెక్కింది. ఈ సినిమాలో చంద్రముఖిగా కంగనా రనౌత్ నటించింది. కానీ ఈ సినిమా పేక్షకులను ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








