అక్క టాలీవుడ్‌లో తోప్ హీరోయిన్.. చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా ఇండస్ట్రీలో ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు, హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్స్ కూడా అదే కోవకు చెందిన వారు. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్లు ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోయారు. అక్క ఇప్పటికీ సినిమాలు చేస్తుంటే చెల్లి మాత్రం సినిమాలు మానేసింది.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే కొంతమంది హీరోల బందువులు, హీరోయిన్స్ సిస్టర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పైన కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్ చెల్లెలు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.? తక్కువ సినిమాలతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఆ అమ్మడు. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. దాంతో ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అయ్యేరు. ఆమె అక్క ఇప్పుడు సినిమాల్లో రాణిస్తుంది. ఆమె మరెవరో కాదు.
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
క్రేజీ బ్యూటీ నిషా అగర్వాల్.. ఈ అమ్మడు కాజల్ అగర్వాల్‌కు చెల్లెలు. నిషా తన సినీ ప్రస్థానాన్ని 2010లో తెలుగు చిత్రం ఏమైంది ఈవేళతో ప్రారంభించింది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వరుసగా సోలో (2011, మలయాళం), ఇష్టం (2012, తమిళం) వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో సుకుమారుడు, డీకే బోస్, కపిన్ బాబు వంటి సినిమాలు కొన్ని ఆమె గుర్తింపు తెచ్చినవి. కానీ ఆతర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు ఈ ముద్దుగుమ్మ.
ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
ఆ తర్వాత కెరీర్ పీక్ లో ఉండగానే వివాహం చేసుకుంది ఈ అందాల తార. ఇక తల్లిగా బాధ్యతల తర్వాత ఆమె నటనకు పూర్తిగా దూరమైంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫొటోలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక కాజల్ విషయానికొస్తే కాజల్ ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తుంది. చివరిగా కన్నప్ప సినిమాలో పార్వతి దేవిగా కనిపించి ఆకట్టుకుంది కాజల్ అగర్వాల్.
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








