Kanchana: యావదాస్తిని దేవాలయాలకు స్వచ్చంద సంస్థలకు ఇచ్చిన గొప్ప నటి.. కాంచన పుట్టిన రోజు నేడు..
దక్షిణాది సినిమా రంగంలో గొప్ప గొప్ప నటీమణులు ఏలుతున్న సమయంలో సువర్ణ సుందరి సినిమాలో నాగ కన్య పాత్రలో నటించి వెండి తెరపై అడుగు పెట్టారు కాంచన. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్న సమయంలో 1970లో దర్శకుడు శ్రీధర్ 'ప్రేమించి చూడు' సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు.
Sr. Actress Kanchana Birth Day Special: అచ్చ తెలుగు అమ్మాయి.. రాయంచ, దక్షిణాది ప్రముఖ నటీమణి, గ్లామర్స్ స్టార్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ‘కాంచన’ నేడు పుట్టిన రోజు. ఎయిర్ హోస్టెస్ నుంచి వెండి తెరపై నటిగా అడుగు పెట్టిన మెరుపు తీగ.. హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన విలక్షణ నటి కాంచన. దక్షిణాది సినిమా రంగంలో గొప్ప గొప్ప నటీమణులు ఏలుతున్న సమయంలో సువర్ణ సుందరి సినిమాలో నాగ కన్య పాత్రలో నటించి వెండి తెరపై అడుగు పెట్టారు కాంచన. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్న సమయంలో 1970లో దర్శకుడు శ్రీధర్ ‘ప్రేమించి చూడు’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. వీరాభిమన్యు, కల్యాణ మండపం వంటి సినిమాలు హీరోయిన్ గా కాంచన కెరీర్ కు బంగారు బాట వేశాయి.
ఆత్మ గౌరవం, డాక్టర్ ఆనంద్, ప్రేమించి చూడు, అవే కళ్లు, మనుషులు మారాలి, మంచి కుటుంబం, నేనంటే నేనే.. వంటి సాంఘిక చిత్రాల్లోనే కాదు దేవకన్య, అందం కోసం పందెం, శ్రీకృష్ణావతారం వంటి జానపద, పౌరాణిక చిత్రాల్లో కూడా నటించారు. 2017 లో విజయ్ దేవర కొండా హీరోగా తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నటించారు. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ ప్రాంతీయ భాషలతో పాటు బాలీవుడ్ హిందీ సినిమాల్లో నటించారు. కాంచన అసలు పేరు పురాణం వసుంధరాదేవి.. ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో 1939 ఆగష్టు 16న జన్మించారు. మంచి సంపన్న కుటుంబలో పుట్టినా.. ఆర్ధిక పరిస్థితి తారుమారు కావడంతో ఎయిర్ హోస్టెస్ గా మారి జీవితాన్ని ప్రారంభించారు. స్టార్ హీరోయిన్ గా కోట్ల ఆస్తులను గడించిన కాంచన జీవితం తల్లిదండ్రులు ఆస్తుల కోసం కన్న కూతురిని ఇబ్బంది పెట్టిన విధానం ఒక సినిమాలను తలపిస్తాయని అంటారు. తన యావదాస్తిని పలు దేవాలయాలకు, స్వచ్చంధ సంస్థలకు విరాళం ఇచ్చిన గొప్ప మనసున్న మనిషి..బ్రహ్మచారిణిగా జీవితాన్ని గడిపారు. తన నటనతో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్న కాంచన నేడు 83వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. కాంచన అమ్మకి భగవంతుడు పూర్తి ఆరోగ్యాన్ని, రోగరహిత జీవితాన్ని ప్రసాదించాలని టీవీ 9 కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.
మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..