Ram Charan: రామ్ చరణ్ కోసం మరో బాలీవుడ్ బ్యూటీ.. ఈసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించనుందట.. ఎవరో తెలుసా ?..
పొలిటికల్ బ్యాగ్రౌండ్ స్టోరీగా ఈ సినిమా రాబోతుందని.. ఇందులో చరణ్ పవర్ ఫుల్ రాజకీయ నాయుకుడిగా కనిపించనున్నాడని ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటనకు యావత్ దేశమే ఫిదా అయ్యింది. ప్రస్తుతం చరణ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. పొలిటికల్ బ్యాగ్రౌండ్ స్టోరీగా ఈ సినిమా రాబోతుందని.. ఇందులో చరణ్ పవర్ ఫుల్ రాజకీయ నాయుకుడిగా కనిపించనున్నాడని ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఈ మూవీ నుంచి చెర్రీ ఫోటోస్ , వీడియోస్ నెట్టింట లీకైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది.
లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ మూవీలో మరో బాలీవుడ్ బ్యూటీ నచించనుందట. ఆమె మరెవరో కాదు.. బీటౌన్ నటి హుమా ఖురేషి. ఈ ప్రాజెక్టులో కీలకపాత్రలో నటించనుందట. ఉత్తరాది రాజకీయ నాయకురాలిగా నటిస్తోందని..ఇందులో ఆమె పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఆమో రోల్ ఇదివరకెన్నడు చూడని విధంగా సరికొత్తగా ఉండనున్నట్లు టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ సినిమాను ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.