Vijay Devarakonda: రౌడీ హీరో రూటే సపరేట్.. జర్నలిస్ట్‌తో విజయ్ వ్యవహారశైలికి ఫిదా అవుతోన్న ఫ్యాన్స్..
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఇప్పుడీ పేరు ఓ సంచలనం. అతి తక్కువ సమయంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడీ యంగ్ హీరో. తెలుగులోనే కాకుండా...
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఇప్పుడీ పేరు ఓ సంచలనం. అతి తక్కువ సమయంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడీ యంగ్ హీరో. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ తనదైన యాటిట్యూడ్‌తో అభిమానులను ఆకట్టుకుంటాడు విజయ్. ఈ క్రమంలోనే తాజాగా లైగర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ జర్నలిస్ట్‌తో విజయ్ వ్యవహరించిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న విజయ్‌ని అవతలి వైపు ఉన్న జర్నలిస్ట్ మాట్లాడుతూ.. ‘టాక్సీవాలా సమయంలో మనం ఫ్రీగా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మీరు స్టార్ అయ్యారు. అప్పట్లాగే ఫ్రీగా మాట్లాడలేపోతున్నాం’ అని అన్నాడు. దీంతో వెంటనే స్పందించిన విజయ్.. ‘అట్లేం లేదు.. మీరు అడగండి. కాలు మీద కాలు వేసుకొని అడగండి. నేను కూడా అట్లే కూర్చుంట. ఫ్రీ గా మాట్లాడుకుందాం’ అంటూ సమాధనం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా కుర్చీపై రెండు కాళ్లు పెట్టుకొని మాట్లాడుతూ సందడి చేశాడు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన విజయ్ ఫ్యాన్స్ అంత స్టార్‌డమ్ ఉన్నా విజయ్ అటిట్యూడ్ గ్రౌండ్ టు ఎర్త్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘లైగర్’ చిత్రం ఆగస్టు 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. అనన్య పాండే హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..